TDP MP: ప్రత్యేకత చాటుకున్న ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:57 AM
న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి తమ ప్రత్యేకను చాటుకున్నారు. ఎంపీగా అందుకున్న తొలి జీతాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు. తనకు వచ్చిన నెల జీతం రూ. లక్షా 57వేల చెక్‌ను సీఎం చంద్రబాబుకు అందించారు.
న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎంపీ (TDP MP) కలిశెట్టి అప్పలనాయుడు (Kalishetty Appalanaidu) మరోసారి తమ ప్రత్యేకను చాటుకున్నారు. ఎంపీగా అందుకున్న తొలి జీతాన్ని (First Salary)అమరావతి (Amaravati) నిర్మాణానికి విరాళంగా అందించారు. తనకు వచ్చిన నెల జీతం రూ. లక్షా 57వేల చెక్ (One lakh 57 thousand cheque)ను సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు అందించారు. దీంతో ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన అప్పలనాయుడు అందరి దృష్టి ఆకర్షించారు.
టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలో నివాసం ఉంటున్న అతిథి గృహం నుంచి సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్‌కు వెళ్లారు. ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసిన అనంతరం కుటుంబంతో కలిసి బయటకు వచ్చారు. అక్కడి నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు బయలుదేరారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టబోతున్న అప్పలనాయుడు.. తెలుగు సంప్రయామైన పంచె కట్టులో కనిపించారు.
ఐదేళ్ల తర్వాత రాష్ట్రప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో గత ఐదేళ్ల నియంత పాలనకు సంకేళ్లు వీడి, మీడియాకూ స్వాతంత్య్రం వచ్చినట్లైంది. నియంత పాలన పోవడంతో తెలుగు ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పునర్నిర్మాణానికి జగన్ సహకరించాలి. ప్రతిపక్ష హోదా లేకున్నా.. జగన్‌కు చంద్రబాబు ఇచ్చిన గౌరవాన్ని ప్రజలంతా చూశారు. ఇలాగే ప్రభుత్వానికి జగన్ మంచి సలహాలు, సూచనలివ్వాలి’ అని ఎంపీ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాలుడికి అరుదైన వ్యాధి.. సహాయం కోసం ఎదురుచూపులు..
చిత్తూరు కార్పొరేషన్‌లో వైసీపీకి భారీ షాక్
జగన్ హయాంలో భారీగా ఇసుక దోపిడీ..
వైసీపీ నేతల బంధువులకే మార్కులు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News