Share News

Dwarka Tirumala: మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న

ABN , Publish Date - May 22 , 2024 | 10:51 AM

ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు బుధవారం చిన వెంకన్న స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Dwarka Tirumala: మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న

ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల (Dwarka Tirumala) చిన్న వెంకన్న (Chinna Venkanna) ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు బుధవారం చిన వెంకన్న స్వామి మోహిని (Mohini) అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం ఆలయ అధికారులు స్వామివారిని సింహ వాహనం (Simha Vahanam)పై ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరగనుంది. అనంతరం వెండి గరుడవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు.


కాగా ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం స్వామివారు రామ లక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే హనుమద్వాహనంపై స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు రోడ్లపైకి తరలి వచ్చారు. కాగా రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరగింది. అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారిని అధికారులు ఊరేగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 22 , 2024 | 10:54 AM