Minister Nimmala: తల్లికి సాయం, తండ్రికి స్నేహం. అన్నదమ్ములకు ఆసరా: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:17 AM
ప.గో. జిల్లా: మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం పాలకొల్లు సేవ్ గర్ల్ చైల్ఢ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు హాజరయ్యారు.
ప.గో. జిల్లా: మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆదివారం ఉదయం పాలకొల్లు (Palakollu)లో ‘సేవ్ గర్ల్ చైల్ఢ్’ (Save Girl Child) పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 2కే రన్ (2K run) ప్రారంభించారు. ఇందులో విద్యార్థులు (Students) పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha), జిల్లా కలెక్టర్ నాగరాణి (Collector Nagarani), తదితరులు హాజరయ్యారు. ‘భ్రూణ హత్యలను నిర్మూలిద్దాం, ఆడపిల్లలను రక్షించుకుందాం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహిళలను గౌరవించే దేశం మనది
ఈ సందర్బంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. మహిళలను గౌరవించే దేశం మనదని.. ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ కార్యక్రమాలే కాదు.. సామాజిక చైతన్య కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. ఆడపిల్ల అంటే ఇంటికి ఎంతో అందమని, తల్లికి సాయం, తండ్రికి స్నేహం. అన్నదమ్ములకు ఆసరాగా ఉంటుందని అన్నారు. బాలికల పట్ల చిన్నచూపు పోవాలనే ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే, ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందన్నారు. వారిని కాపాడుకాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టాఆర్ అని, ఆడపిల్లలకు మంచి అవకాశాలు ఇస్తే, మంచి స్దాయికి వెళతారని వ్యాఖ్యానించారు.
ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్న నమ్మకం గల దేశం మనదని, తాను మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిరహిస్తూ వస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సామాజిక బాధ్యత కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని అనుకునే వారని... ఇప్పుడు పరిస్థితులు మారి... ఆడపిల్ల అంటే భారంగా, గుండెలపై కుంపటిలా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నుంచి మార్పు రావాలని, మహిళలు ఎవరిపైనా ఆధారపడకూడదనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. మహిళల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి ఇంట్లో ఆడపిల్లలను ప్రోత్సహించాలని, ఆడపిల్లలకు అవకాశాలు ఇస్తే బాగా రాణిస్తారని అన్నారు. ఆడపిల్లలకు మంచి అవకాశాలు ఇస్తే, మంచి స్దాయికి వెళతారని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానందిలో చిరుతపులి సంచారం కలకలం..
అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం
జగిత్యాలలో ఆదివారం ఎమ్మెల్సీ కవిత పర్యటన
ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News