AP Election 2024: నిమ్మల రామానాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Apr 01 , 2024 | 12:46 PM
పశ్చిమ గోదావరి జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లు నియోజవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నిమ్మల రామానాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న రామానాయుడుకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా పాలకొల్లు (Palakollu) నియోజవర్గ తెలుగుదేశం (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమి అభ్యర్థి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న రామానాయుడుకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ (Angara Rammohan)తో కలిసి ఆయన ఇంటింటా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పంపిణీ చేసే పెన్షన్ల (Pensions) వ్యవహారంలో సీఎం జగన్ (CM Jagan) రాజకీయ లబ్ధితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెన్షన్ డబ్బును సచివాలయాల్లో పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడమేనన్నారు. ఎండలుఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు రావడానికి ఇబ్బందులు పడతారని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలే గాని సచివాలయాల్లో ఇస్తామనడం సరికాదన్నారు.
పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను (Volunteers) దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయవచ్చునని ఎమ్మెల్యే రామానాయుడు సూచించారు. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేస్తే మూడు రోజుల్లో అందరికీ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగులు పెన్షన్లను ఇంటింటికి వెళ్లి ఇచ్చేవరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అండగా ఉంటుందని రామానాయుడు స్పష్టం చేశారు. జగన్ సీఎం కుర్చీ కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.