Share News

Eluru: పరారీలో హర్షిత స్కూల్ ప్రిన్సిపల్ రాణి.. వేట మెుదలుపెట్టిన సీఐడీ అధికారులు..

ABN , Publish Date - Dec 18 , 2024 | 08:51 PM

కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ నందిగం రాణి భర్త ధర్మరాజును రాజమండ్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.33 కోట్ల నగదు లావాదేవీల వ్యవహారంలో అధికారులు అతన్ని అరెస్టు చేయగా, ఆయన భార్య రాణి మాత్రం పరారీలో ఉన్నారు.

Eluru: పరారీలో హర్షిత స్కూల్ ప్రిన్సిపల్ రాణి.. వేట మెుదలుపెట్టిన సీఐడీ అధికారులు..
Harshita English Medium School

ఏలూరు: కామవరపుకోట మండలం తడికలపూడి(Tadikalapudi) హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ నందిగం రాణి (Nandigam Rani) భర్త ధర్మరాజు (Dharmaraju)ను రాజమండ్రి సీఐడీ పోలీసులు(CID Police) అరెస్టు చేశారు. రూ.33 కోట్ల నగదు లావాదేవీల వ్యవహారంలో అధికారులు అతన్ని అరెస్టు చేయగా, ఆయన భార్య రాణి మాత్రం పరారీలో ఉన్నారు. హర్షిత స్కూల్ ప్రిన్సిపల్‌ రాణి ఆన్‌లైన్ ద్వారా తమ నుంచి రూ.33 కోట్లు తీసుకున్నారని 65 మంది బాధితులు గతేడాది హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు కాగా.. అప్పడే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రాణి కొంత కాలం జైలులోనే ఉండి ఇటీవల విడుదల అయ్యారు.

Hyderabad: లగచర్ల ఘటనలో అరెస్టయిన వారందరికీ బిగ్ రిలీఫ్..


అయితే ఈనెల 16న సీఐడీ బృందం విచారణ నిమిత్తం రాణికి నోటీసులు ఇచ్చేందుకు పాఠశాల వద్దకు వెళ్లారు. అధికారులను చూసిన రాణి ఓ గది లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద హంగామానే నడిచింది. ఆమె ఎంతకీ బయటకు రాలేదు. రాత్రి వరకూ చూసిన అధికారులు కిటికీ నుంచే ఆమె నోటీసులు అందజేసి వెళ్లిపోయారు. సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో మంగళవారం నాడు ధర్మరాజు, సురేశ్ రాజమండ్రి సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

Hyderabad: నటితో అలా ప్రవర్తించిన ప్రముఖ యూట్యూబర్.. చివరికి ఏం జరిగిందంటే..


వారిద్దరి సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో బుధవారం నాడు వారిద్దరినీ సీఐడీ అధికారులు అరెస్టు చేసి రాజమండ్రికి తీసుకెళ్లారు. కాగా, ప్రిన్సిపల్ రాణి మాత్రం పరారీలో ఉన్నారు. కాగా, ఈ కేసులో ప్రిన్సిపల్ రాణి ఏ-1గా, ఆమె భర్త ధర్మరాజు ఏ-2గా, సురేశ్ అనే వ్యక్తి ఏ-3గా ఉన్నారు. మరోవైపు రాణిపై కేసు నమోదు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. వారు అరెస్టయితే తమ పిల్లల భవిష్యత్తు పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

weather updates : అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Paritala Ravi: పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్..

Updated Date - Dec 18 , 2024 | 08:57 PM