Share News

Eluru: రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

ABN , Publish Date - Oct 18 , 2024 | 08:47 AM

ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.

Eluru: రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు (Eluru)లోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల (Dwaraka Tirumala)... చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న (China Venkanna) రాజమన్నార్ (Rajamannar ) అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.


కాగా గురువారం చిన వెంకన్న కల్యాణం తంతును అర్చకులు వైభవంగా నిర్వహించారు. సర్వాభరణ భూషితుడై, పెండ్లి కుమారుడిగా సర్వజగరకుడైన శ్రీవారు. బుగ్గన దుక్కలతో సిగ్గులొలుకుతున్న అలివేలు మంగ ఆండాళ్. దేవేరులను పరిణయమాడారు. ఈ కల్యాణ ఘడియలో స్వామి చిన్న మంగళ స్వరూపాన్ని వీక్షించి భక్తులు తరించారు. ఈ బద్భుత దృశ్యం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. తొలుత రాత్రి తొక్కు వాహనంపై శ్రీవారు,, అమ్మవార్ల కల్యాణమూర్తులను, ఉంచి అలంకరించి ఆట అనివేటి మండపంలో ఏర్పాటు. చేసిన వేదిక దగ్గరకు తీసుకొన్ని అక్కడ బంగారు సింహాసనంపై కళ్యాణమూర్తులను ఉంచి అర్చకులు కళ్యాణ తంతును ప్రారంభించారు. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిగిన ఈ కల్యాణ తంతులో ఆలయ అర్చకులు ముందుగా శాంతి హోమాన్ని చేసి సర్వదేవతారాధన. సంకటం, కరణ పూజలు నిర్వహించారు. దేవస్థానం తరపున ఆలయ చైర్మన్ రాజా ఎస్పీ సుధాకరరావు ప్రభుత్వం తరఫున గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు స్వామి అమ్మ వార్లకు పట్టువస్త్రాలు అందించారు. ఆ తర్వాత అర్చకులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న చైర్మన్ సుధాకరరావు, ఎమ్మెల్యే మద్దిపాటి, ట్రస్ట్ విద్యుతరావు మూర్తులకు మధువర్యాలను సమర్పించారు సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపచేసి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ మాంగల్య చారణ, తలంబ్రాలు వైభవోపేతంగా జరిపించారు. అలండు ఈవో ఎస్వీఎస్ఎన్ మూర్తి కల్యాణ ఏర్పాట్లను పర్యవేక్షించగా, ఈఈ భాస్కర్ పాల్గొన్నారు.


కాగా ద్వారకా తిరుమలలో ఏడాదిలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఒకసారి వైశాఖమాసంలో, మరోసారి అశ్వయుజ మాసంలో స్వామివారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలను ఎనిమిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. శుక్రవారం ద్వారకా తిరుమలలోని మాఢ వీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరిగే 8 రోజులపాటు వివిధ వాహనాలపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తారు. కాగా శనివారం (19వ తేదీ) ఉద‌యం ఏడు గంట‌ల‌కు చక్రస్నానం, రాత్రి ఏడు గంట‌ల‌కు శ్రీ‌వారి ధ్వజావ‌రోహ‌ణ కార్యక్రమాలు జ‌రుగుతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

నాంపల్లి కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్

అమరావతి: సూపర్ 6తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు..

టీడీపీ కార్యాలయంపై దాడి తప్పు కాదట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 18 , 2024 | 08:47 AM