Share News

Duvvada Srinivas: ఎవరీ దివ్వెల మాధురి? దువ్వాడ మాటల్లోనే...

ABN , Publish Date - Aug 10 , 2024 | 01:59 PM

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మాంచి రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజులుగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ తమను వదిలేసి వేరొక మహిళతో ఉంటున్నాడంటూ ఆయన కూతుళ్లిద్దరూ మొన్న రాత్రంతా ఆయన నివాసం ముందు ఆందోళన చేశారు.

Duvvada Srinivas: ఎవరీ దివ్వెల మాధురి? దువ్వాడ మాటల్లోనే...

శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) కుటుంబ కథా చిత్రం మాంచి రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజులుగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ తమను వదిలేసి వేరొక మహిళతో ఉంటున్నాడంటూ ఆయన కూతుళ్లిద్దరూ మొన్న రాత్రంతా ఆయన నివాసం ముందు ఆందోళన చేశారు. ఇక నిన్న రాత్రి ఆయన భార్య వాణి, పెద్ద కూతురు హైందవి దువ్వాడ ఇంటి ముందు రాత్రంతా బైఠాయించారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడ ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. దువ్వాడతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందంటూ ఆయన భార్యాపిల్లలు ఆరోపిస్తున్న ఆ దివ్వెల మాధురి ఎవరనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.


Duvvada-And-Madhuri.jpg

విడాకులు ఇస్తా..!

మాధురి ఒక డ్యాన్సన్ టీచర్ అని.. మాధురిని తనకు పరిచయం చేసింది తన భార్య వాణియేనని దువ్వాడ పేర్కొన్నారు. తనకూ.. మాధురికి మధ్య వాణి లేని పోనివి అంటగట్టిందని వాపోయారు. వాణి మాటల వలన మాధురి కూడా ఆత్మ హత్య చేసుకోబోయిందన్నారు. తన కుటుంబం వలన చనిపోబోయిన అమ్మాయికి తాను దగ్గర అయ్యానని.. కలిసి తిరిగానని వివరించారు. రెండేళ్లుగా దూరంగా ఉన్నా కూడా వాణి తనను ఖాతరు చేయలేదని దువ్వాడ తెలిపారు. తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని దువ్వాడ చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటీస్‌లు పంపిస్తానన్నారు. తన కుమార్తెలను చూసుకునే బాధ్యత తనదేనని తెలిపారు. మాధురి తన దగ్గరకి వచ్చి వెళుతుందని దువ్వాడ వెల్లడించారు. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్నీ తానై తనకు మాధురి సపర్యలు చేసిందని వెల్లడించారు. ఎన్నికల్లో సైతం మాధురి తన కోసం రూ.2 కోట్లు ఖర్చుచేసిందని దువ్వాడ తెలిపారు.


Duvvada-Vs-Vani.jpg

ఏం జరిగినా అచ్చెన్నదే బాధ్యత!

ఎన్నికలకు ముందు.. తరువాత తమ కుటుంబ వ్యవహారాలు మారిపోయాయని దువ్వాడ అన్నారు. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తన కుటుంబాన్ని కూడా పక్కన బెట్టానని దువ్వాడ తెలిపారు. వివాహ వ్యవస్థలో భర్తకి గౌరవం ఇవ్వాలని కానీ తన కుటుంబమే తనపై దాడి చేసిందన్నారు. కుటుంబాన్ని పెళ్లైన నాటి నుంచి కూడా బాగానే చూశానన్నారు. తన కుటుంబానికి ఎండ కూడా తగలనివ్వలేదని దువ్వాడ అన్నారు. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టే బయటకి వచ్చానని తెలిపారు. తన కుమార్తె కి వివాహం కూడా చేశానని.. ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. తన కుమార్తెలను అల్లారు ముద్దుగా పెంచుకున్నానని.. ఇప్పుడు తన కుమార్తెలే తనపై విషం చిమ్మారని అన్నారు. తన భార్య తనపై ఈర్ష్యా ద్వేషాలు పెంచుకున్నదని చెప్పారు. తన గ్రానైట్ ఆదాయం అంతా తన భార్య వాణి చేతుల్లోనే పెట్టానని దువ్వాడ తెలిపారు. తన తమ్ముడు, తన తల్లిని కూడా వాణి ఖాతరు చేయలేదని తెలిపారు. తన భార్య డంబుల్‌తో తనపై దాడి చేసిందని అంత తప్పు తానేం చేశానని ప్రశ్నించారు. తన ప్రత్యర్థి అచ్చెన్నాయుడితో కలిసి వాణి తనపై దాడికి దిగిందన్నారు. అచ్చెన్నాయుడితో కలిసిపోయే ఎన్నికల్లోతనను ఓడించిందన్నారు. తన భార్యకు విడాకులు ఇస్తానన్నారు. తనకు ఏదైనా జరిగితే అచ్చెన్నాయుడిదే బాధ్యత అని దువ్వాడ తెలిపారు.

Duvvada-Family-Fight.jpg

Updated Date - Aug 10 , 2024 | 02:10 PM