Home » Duvvada Srinivas
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
సోషల్ మీడియాలో తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్వెల వాణి.. టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. ఆ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు ఫిర్యాదు చేసేందుకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సైతం దివ్వెల వాణితో కలిసి పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు అధికార పార్టీల నుంచి హాని ఉందని ఈ సందర్బంగా దివ్వెల వాణి ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీలో లిక్కర్ రేట్లు చాలా తక్కువ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయిందని అన్నారు. సీబీ సీఐడీ విచారణ కూడా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్లో భారీ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది.
తిరుమలలో తాము వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ఖండించారు. తాము వివాహం చేసుకోలేదని, కొంత మంది పని గట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు.
తన భార్యతో వివాదం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ చాలా సైలెంట్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు దూరంగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపించారు. ఈ అంశంపై కొంత వివాదం నడిచింది. ఇదే సమయంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన వివాదం దువ్వాడ శ్రీనివాస్‌ను వెంటాడింది. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ తన ప్రియురాలు మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల కొండపై కనిపించారు.
దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న వివాదాస్పద ఇంటి వద్దకు ప్రియురాలు దివ్వెల మాధురి వచ్చింది. దువ్వాడ శ్రీను ఇంట్లోకి వెళ్లేందుకు గత నెలరోజుల నుంచి దువ్వాడ వాణి ఇంటి బయట ఆందోళన చేస్తోంది. ఇంతలో మాధురి వచ్చి, లోపలికి వెళ్లడంతో వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది.
: దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కంటిన్యూ అవుతోంది. పూటకో అప్ డేట్, రోజుకో న్యూస్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న ఇంటిపై వివాదం నెలకొంది. ఆ ఇంటిని కూతుళ్ల పేరుతో రాయాలని దువ్వాడ వాణి భీష్మించుకొని కూర్చొంది. ప్రియురాలు దివ్వెల మాధురి పేరుతో ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ రిజిష్ట్రేషన్ చేయించేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆడిన మరో డ్రామా బయటపడింది. దివ్వెల మాధురితో కలిసి ఆడిన ఆత్యహత్యాయత్నం నాటకం గుట్టురట్టయింది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరుకుంది. ఇరు కుటుంబ సభ్యుల చర్చలు కొలిక్కి రాలేదు. దువ్వాడ వాణి రోజుకో కొత్త డిమాండ్ తీసుకొస్తున్నారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని, అతను ఉంటోన్న ఇంట్లోనే ఉంటానని చెబుతున్నారు. వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు.