Share News

AP News: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:04 PM

రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. గీత దాటితే తాటా తీస్తాం అని పోకిరిలను తనదైన శైలిలో హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని వివరించారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని హోం మంత్రి అనిత ప్రకటించారు.

AP News: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
Home Minister Anitha

అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. గీత దాటితే తాటా తీస్తాం అని పోకిరిలను తనదైన శైలిలో హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని వివరించారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని హోం మంత్రి అనిత ప్రకటించారు. ఇందుకోసం పోలీసులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత మాట్లాడారు.


గత ప్రభుత్వ హయాంలో రోజు ఎనిమిది మంది అమ్మాయిలు చొప్పున కనిపించకుండా పోయారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదన్నారు. మూసి వేసిన కేసులను తెరిపిస్తామని అనిత స్పష్టం చేశారు. దిశ చట్టానికి చట్టబద్దత లేదని స్పష్టం చేశారు. మహిళా సంరక్షణ కోసం ధీటైన చట్టం అమల్లోకి తీసుకొస్తామని తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ఒక్కో అంశాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళతామని హోం మంత్రి అనిత తేల్చి చెప్పారు. అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేయాలని సూచించారు.


గ్రోయిన్ ఏర్పాటు చేయకపోవడంతో వ్యవసాయానికి సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల సమస్యలపై దృష్టిసారించాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిని పరిష్కరిస్తాం అని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

Amaravati: ఆదివారమైనా తగ్గేదే లే.. లోకేష్ తీరుపై ప్రజల హర్షం..

YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..

Updated Date - Jun 16 , 2024 | 05:04 PM