AP Politics: బడ్జెట్‌పై జగన్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:50 PM
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ.. తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
అమరావతి, నవంబర్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నటనలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ని మించిపోయారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్పందించారు.
Also Read: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు
బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రం అయినా.. అప్పులు చేయడమంటే బడ్జెట్‌లో భాగమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్పులపై నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దుగ్గుబాటి పురంధరేశ్వరి తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ఎన్నికల నాటికి ఒక పద్ధతి ప్రకారం రూ.14 లక్షల కోట్లు అప్పు అని వీళ్లు తప్పుడు ప్రచారం సైతం చేశారని మండిపడ్డారు.
Also Read: గాడిద పాలు తాగితే ఇన్ని లాభాలున్నాయా..?
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. అప్పుల విషయంలో శ్రీలంక అవుతుందంటూ ప్రచారం కూడా చేయించారన్నారు. ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు పెట్టిన ఒక డాక్యుమెంట్ అని వైఎస్ జగన్ అభివర్ణించారు. ఎవరైనా.. బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు ఫుల్ ఫిల్ చేయాలని చూస్తారన్నారు. కానీ ఈ ప్రభుత్వం అలా చేయడం లేదన్నారు.
Also Read: karthika pournami: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..
గత ఎనిమిది నెలలుగా.. ఓటు అన్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వాన్ని నడిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారని కూటమి ప్రభుత్వాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. బడ్జెట్ పెడితే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయనే.. ఇంతకాలం బడ్జెట్ పెట్ట లేదని ఆయన ఆరోపించారు. రక రకాల కారణాలతో బడ్జెట్ పెట్టకుండా కాలాన్ని సాగదీశారంటూ కూటమి ప్రభుత్వంపై ఈ సందర్భంగా వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చంద్రబాబు ఎలా చేస్తారో.. ఈ బడ్జెట్ చూస్తే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు
మరి రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం రూ.6 లక్షల 46 కోట్ల అప్పులుగా చూపారని వివరించారు. అప్పుల నియంత్రణలో ఏదైనా అవార్డు ఇవ్వాలంటే అది వైసీపీ ప్రభుత్వానికే ఇవ్వాలన్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. మరి ఎవరి హయాంలో రాష్ట్రం శ్రీలంక అయింది?.. అప్పు రత్న బిరుదు ఎవరికీ ఇవ్వాలి?.. ఎవరు ఉంటే రాష్ట్రం శ్రీలంక అయ్యే అవకాశముందంటూ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నలు సంధించారు.
నవంబర్ 11న బడ్జెట్ ప్రవేశపెట్టిన సర్కార్
ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ఈ నవంబర్ మాసంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో సోమవారం అంటే.. నవంబర్ 11వ తేదీన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అంటే.. సూపర్ సిక్స్ అమలుకు సైతం నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీకి డుమ్మా..
మరోవైపు అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలని స్పీకర్‌ను కోరారు. ఎమ్మెల్యే సంఖ్యా బలం లేకపోవడంతో.. వైఎస్ జగన్‌కు ఆ హోదా ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ అంశంపై ఏపీ హైకోర్టును వైఎస్ జగన్ ఆశ్రయించారు. ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తామని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వైఎస్ జగన్‌తోపాటు మరో 10 మంది అసెంబ్లీకి హాజరు కావడం లేదన్న సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News