Pawan Kalyan: వైసీపీకి కార్పొరేటర్ల షాక్..!!
ABN , Publish Date - Aug 06 , 2024 | 06:00 PM
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ ఒక్కో షాక్ తగులుతోంది. గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొటి వెలుగులోకి వస్తోన్నాయి. మరోవైపు వైసీపీకి శ్రేణులు, నేతలు షాక్ ఇస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన కార్పొరేటర్లు వైసీపీని వీడారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఐదుగురు కార్పొరేటర్లకు పవన్ కల్యాణ్ కండు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ ఒక్కో షాక్ తగులుతోంది. గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొటి వెలుగులోకి వస్తోన్నాయి. మరోవైపు వైసీపీకి శ్రేణులు, నేతలు షాక్ ఇస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన కార్పొరేటర్లు వైసీపీని వీడారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఐదుగురు కార్పొరేటర్లకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కండు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
చేరికలు ప్రారంభం..
‘డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనసేనలో చేరికలు ప్రారంభం అయ్యాయి. ఇన్నాళ్లూ ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉన్నాను. నాకు ఇష్టమైన విశాఖపట్టణం నుంచే జనసేనలోకి చేరికలు ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. వైసీపీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. రాష్ట్ర అభివృద్ది, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. జనసేన పార్టీలో చేరిన వారందరికీ నా తరపున ధన్యవాదాలు. మీ సేవలను పార్టీ గుర్తిస్తుంది. అందరం కలిసి పని చేద్దాం.. ప్రజలకు సేవ చేద్దాం. భవిష్యత్‌లో విశాఖపట్టణం కార్పొరేషన్‌లో కూటమి విజయకేతనం ఎగుర వేయాలి అని’ పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పొల్యూషన్ సమస్య
‘విశాఖపట్టణంలో కాలుష్యం సమస్య చాలా ఎక్కువగా ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నా శాఖలో ఉంది. సమస్యను నా దృష్టికి తీసుకు రండి. గతంలో వంశీకృష్ణ చెప్పిన ఇష్యూకి సంబంధించి కాలుష్యంపై ఆడిట్ చేయాల్సి ఉంది. విశాఖపట్టణంలో రియల్ ఎస్టేట్ అంశాల, ఇతర సమస్యలు చాలానే ఉన్నాయి. ఆ సమస్యలు అన్నింటినీ పరిశీలించి బాధితులకు తగిన న్యాయం చేద్దాం. మీరంతా జనసేన పార్టీని నమ్మి, నాపై గౌరవంతో పార్టీలో చేరినందుకు హృదయ పూర్వకంగా స్వాగతం చెబుతున్నా అని’ కార్పొరేటర్లతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.