Share News

AP: వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన మాజీ సలహాదారు..

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:09 AM

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. తాజాగా, వైసీపీ మాజీ సలహాదారుడు ఒకరు టీడీపీలోకి చేరారు.

AP: వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన మాజీ సలహాదారు..
Jagan

AP: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్. రాజీవ్ కృష్ణ టీడీపీలో చేరారు. రాజీవ్ కృష్ణతో పాటు పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సైతం తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. మంత్రి నారా లోకేష్ వారిని పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కింగ్‌ మేకర్‌గా..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకప్పుడు టీడీపీలో కింగ్‌ మేకర్‌గా వ్యవహరించారు ప్రముఖ పారిశ్రామికవేత్త పెండ్యాల కృష్ణబాబు అల్లుడు రాజీవ్‌కృష్ణ. పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ సామాన్య కార్యకర్తలతో కూడా కలసిమెలసి ఉండే స్వభావం ఆయనది. 2012లో వైసీపీలో చేరారు. 2014లో నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

టీడీపీకి బలం..

తర్వాత 12ఏళ్లుగా కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో పార్టీకి వెన్ను దన్నుగా నిలబడ్డారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. పార్టీ శ్రేణులు, ద్వితీయ స్థాయి నేతల ఒత్తిడితో రాజీవ్‌కృష్ణ టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా పట్టున్న రాజీవ్‌కృష్ణ చేరికతో టీడీపీకి బలం మరింత పెరిగినట్టేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 02:08 PM