ACA: ఏసీఏని వదలని వైసీపీ దొంగల ముఠా
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:36 PM
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో (ఏసీఏ) భారీ అక్రమాలు జరిగాయని జనసేన పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అక్రమాలపై విచారణ జరపాలని ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏసీఏలో అక్రమాలకు సంబంధించి 2008లో హైకోర్టులో కేసు నడుస్తోందని గుర్తుచేశారు. ఏసీఏలో వందల కోట్ల నిధులు ఉన్నాయని, ఆ నిధులను వైసీపీ దొంగల ముఠా దోపిడీ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
విశాఖ: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో (ACA) భారీ అక్రమాలు జరిగాయని జనసేన పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అక్రమాలపై విచారణ జరపాలని ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏసీఏలో అక్రమాలకు సంబంధించి 2008లో హైకోర్టులో కేసు నడుస్తోందని గుర్తుచేశారు. ఏసీఏలో వందల కోట్ల నిధులు ఉన్నాయని, ఆ నిధులను వైసీపీ దొంగల ముఠా దోపిడీ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్ర రెడ్డిని ఎలా అధ్యక్షుడు చేశారని పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. వైస్ ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చారని.. వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి బినామీ గోపినాథ్ రెడ్డి కార్యదర్శి అయ్యారని వివరించారు. ముగ్గురికి క్రికెట్ చరిత్ర లేదని, అలాంటిది వీరికి ఎలా పదవులు ఇస్తారని ప్రశ్నించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రోద్బలంతో ముగ్గురికి ఏసీఏలో పదవులు వచ్చాయని స్పష్టం చేశారు.
ఆడుదాం ఆంధ్ర పేరుతో దోపిడీ
‘ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది. క్రీడల పేరుతో ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులను కేటాయించింది. ఎక్కడ క్రీడల ఉన్నతి కోసం పాటు పడిందని లేదు. ఏసీఏ సభ్యులు దందాగా మార్చారు. వ్యాపారులను బెదిరించి రూ.500 కోట్లు వసూల్ చేశారు. నిధులు ఉన్న కోచ్‌లకు జీతాలు ఇవ్వలేదు. ఏసీఏలో జరుగుతోన్న పరిణామాలను చూసి ఆంధ్ర రంజి కెప్టెన్ విహారి క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.. వైసీపీ క్రికెట్ అసోసియేషన్‌గా మారింది అని’ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు.
కోట్లు కొల్లగొట్టి
‘కడపలో స్టేడియం పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టారు. ఏసీఏ నిధులను క్రికెట్ కోసం కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగించారు. ఏసీఏ నిధులతో వైసీపీ సిద్దం సభలకు బస్సులు, వాలంటీర్లకు సమకూర్చారు. అధికారులకు టికెట్లు సమకూర్చి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతి ఇచ్చారు. ఆంధ్ర ప్రీమియం లీగ్ పేరుతో మరో దోపిడీకి తెరలేశారు. ఈ నెల 30వ తేదీన ఏ పి ఎల్ నిర్వహిస్తున్నారు. ఆ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముకున్నారు. మీడియాకు ఇవ్వాల్సిన పాసులను కూడా విక్రయించారు. ఏసీఏలో జరుగుతోన్న అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణ జరిపించాలి అని’ పీతల మూర్తి యాదవ్ కోరారు.
Pawan Kalyan: నేడు సచివాలయానికి రానున్న పవన్ కళ్యాణ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News