Share News

AP Govt: శారదా పీఠం సేవలో జగన్ సర్కార్.. 2 రోజుల్లో రూ.96 లక్షలతో తారు రోడ్డు

ABN , Publish Date - Feb 21 , 2024 | 08:18 PM

విశాఖలో గల శారదా పీఠం వెళ్లే మార్గం సరిగా లేదు. అక్కడ తారు రోడ్డు వేయించాలని అనుకున్నారు. పీఠాధిపతిపై భక్తిని చాటుకునేందుకు కేవలం రెండు రోజుల్లో నిర్మించారు. పీఠం తారు రోడ్డు కోసం ఏకంగా రూ.96 లక్షలు ఖర్చు చేశారు. 480 మీటర్ల మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చారు.

AP Govt: శారదా పీఠం సేవలో జగన్ సర్కార్.. 2 రోజుల్లో రూ.96 లక్షలతో తారు రోడ్డు

విశాఖ పట్టణం: శారదా పీఠంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌కు (YS Jagan) అంత అభిమానం ఎందుకు..? పీఠాధిపతి ఆదేశాలను తుచ తప్పకుండా ఎందుకు భావిస్తారు. సీఎం జగన్ (YS Jagan) ఒక్కరే కాదు కొందరు మంత్రులు (Ministers) పీఠాధిపతి సేవలో తరించడం వెనక కారణం ఏంటీ.? కోట్ల విలువ జేసే భూములను లక్షలకు, పీఠానికి వెళ్లే మార్గంలో తారు రోడ్డు నిర్మించడం, పీఠం ఆధ్వర్యంలో ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం వెనక కారణం ఏంటీ..?

2 రోజుల్లో రోడ్డు

విశాఖలో గల శారదా పీఠం వెళ్లే మార్గం సరిగా లేదు. అక్కడ తారు రోడ్డు వేయించాలని అనుకున్నారు. పీఠాధిపతిపై భక్తిని చాటుకునేందుకు కేవలం రెండు రోజుల్లో నిర్మించారు. పీఠం తారు రోడ్డు కోసం ఏకంగా రూ.96 లక్షలు ఖర్చు చేశారు. 480 మీటర్ల మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చారు. అక్కడ పీఠం తప్ప మరొటి లేదు. అయినప్పటికీ ప్రజా ధనం వృథాగా ఖర్చు చేశారు. వర్ష కాలంలో, వర్షం పడుతున్న లెక్క చేయకుండా నిర్మించారు. ఇదే నిబద్ధత ఇతర పనుల్లో ఉంటే బాగుండేదని స్థానికులు పెదవి అంటున్నారు.

AP Temples: కప్పరాడ వేంకటేశ్వర ఆలయంపై శారదా పీఠం కన్ను

2 రోజుల్లో 10 లారీలతో చిప్స్ తెప్పించి

చినముషిడివాడ ప్రధాన రహదారిలో శారదా పీఠం ఉంది. మెయిన్ రోడ్డు నుంచి దోబీఖానా వరకు 60 అడుగుల వెడల్పుతో పనులను చేపట్టారు. 10 లారీలతో చిప్ప్ తెప్పించి పనులు పూర్తి చేశారు. ఈ స్థాయిలో వాహనాలు రావడంతో అక్కడున్న స్థానికులు నోరెళ్ల బెట్టారు. వర్షం పడుతున్న లెక్క చేయకుండా రెండు రోజుల్లో పూర్తి చేసి తమ స్వామి భక్తిని చాటు కున్నారు.

2 రోజుల్లో నిర్లక్ష్యం..?

శారదా పీఠానికి సమీపంలో పెందుర్తి-పులగాలిపాలెం రహదారిని నిర్మించాల్సి ఉంది. ఆ రోడ్డు కోసం రూ.1.98 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వందలాది వాహనాలు తిరగడంతో రహదారి పాడయ్యింది. ఈ దారి నిర్మాణం గురించి పాలకులు పట్టించుకోలేదు. శారదా పీఠం కోసం మాత్రం రూ.లక్షలు ఖర్చు చేశారు. ఆగమేఘాల మీద నిర్మాణ పనులను పూర్తి చేశారు. వర్షం పడుతున్న పని చేశారంటే పీఠం దారి మీద పాలకులకు ఏ మేర ఇంట్రెస్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

AP Temples: కప్పరాడ వేంకటేశ్వర ఆలయంపై శారదా పీఠం కన్ను

Updated Date - Feb 21 , 2024 | 08:18 PM