YSRCP: ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి వైసీపీ నేత డబ్బు వసూలు.. సీన్ కట్ చేస్తే..
ABN , Publish Date - Jul 03 , 2024 | 10:01 AM
అధికారం మన పార్టీ చేతిలో ఉంది కదాని ఏదైనా చేయవచ్చనేది అప్పట్లో వైసీపీ నేతల భావన. అందుకే ఉద్యోగాల పేరు చెప్పి.. ఇతరత్రా పనులు చేయిస్తామని చెప్పి సామాన్యుల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు గుంజారు. తీరా పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు సైలెంట్‌గా బాధితులతో సెటిల్‌మెంట్స్ చేసుకుంటున్నారు.
చిత్తూరు: అధికారం మన పార్టీ చేతిలో ఉంది కదాని ఏదైనా చేయవచ్చనేది అప్పట్లో వైసీపీ నేతల భావన. అందుకే ఉద్యోగాల పేరు చెప్పి.. ఇతరత్రా పనులు చేయిస్తామని చెప్పి సామాన్యుల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు గుంజారు. తీరా పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు సైలెంట్‌గా బాధితులతో సెటిల్‌మెంట్స్ చేసుకుంటున్నారు. పైగా ఆ విషయాలను ఎవరికీ చెప్పొద్దంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. అలా అయితే డబ్బులు తిరిగిస్తామని చెబుతున్నారు.
పుంగనూరులో మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వైసీపీ నేత ఒకరు చాలా మంది నుంచి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబ్బు తీసుకున్నారు. తీరా పార్టీ అధికారం కోల్పేయేసరికి ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో ఎవరికీ చెప్పవద్దని మాట తీసుకుని మరీ సదరు నేత డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి దగ్గర లక్షల్లో ఓ ప్రముఖ వైసీపీ నేత డబ్బు వసూలు చేశాడు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయోననే ఉద్దేశంతో మూడో కంటికి తెలియకుండా బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు.