Share News

Ap High Court : జెత్వానీ కేసు.. విద్యాసాగర్‌కు బెయిల్‌

ABN , Publish Date - Dec 10 , 2024 | 05:13 AM

సినీనటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Ap High Court : జెత్వానీ కేసు.. విద్యాసాగర్‌కు బెయిల్‌

  • పలు షరతులు విధించిన హైకోర్టు

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): సినీనటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. విజయవాడ మూడవ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ సంతృప్తి మేరకు రూ.50వేల వ్యక్తిగత బాండ్‌తో రెండు పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. చార్జిషీట్‌ దాఖలు చేసేవరకు లేదా మూడునెలల వరకు ప్రతినెలా 1వ, 15వ తేదీల్లో ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట మధ్య దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రత్యక్షంగాకానీ పరోక్షంగాకానీ సాక్షులను ప్రభావితం, బెదిరించడం చేయవద్దని పిటిషనర్‌కు తేల్చిచెప్పింది. ఇదే తరహా నేరాల్లో పాల్గొనవద్దని, ట్రయల్‌ కోర్టులో విచారణకు తప్పనిసరిగా హాజరవుతుండాలని స్పష్టం చేసింది. కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జెత్వానీపై నమోదైన కేసు, జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా కుక్కల విద్యాసాగర్‌పై నమోదైన కేసు రెండూ దర్యాప్తు దశలోనే ఉన్నాయని గుర్తుచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ సోమవారం తీర్పు ఇచ్చారు.

Updated Date - Dec 10 , 2024 | 05:13 AM