Home » Actress
సినీనటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బీచ్‌లో యోగా చేయడానికి వెళ్లిన హీరోయిన్ చివరకు విగతజీవిగా తిరిగొచ్చింది. థాయిలాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటి మృతిపై దక్షిణాది సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు తన పట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరి జెత్వానీ ఆరోపించారు.
ఓ ముస్లిం మహిళగా, పాత్రికేయురాలిగా తాను మోదీ సర్కారు బాధితురాలినేనంటూ ‘ది వైర్’ సీనియర్ ఎడిటర్ ఆర్ఫాఖానుమ్ షేర్వానీ వ్యాఖ్యానించారు. మోదీ ప్రధాని అయిన మొదట్నుంచి ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంబించారని.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారని ఆరోపించారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్ నటులు, మోడల్స్ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు, కన్నడ నటి పవిత్ర జయరామ్ (42) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి.. దాని పైనుంచి అవతలివైపు రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఆ లేన్‌లో వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి నుజ్జయింది. పవిత్రది కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా ఉమ్మదహల్లి గ్రామం. ఆమెతో పాటు పినతల్లి కుమార్తె ఆపేక్ష, మరో నటుడు చంద్రకాంత్ (చందు), డ్రైవర్ శ్రీకాంత్‌తో కలిసి శనివారం సాయంత్రం కారు (స్కార్పియో)లో బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు.
ఈమధ్య కాలంలో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పరిశ్రమకు చెందిన కథానాయికలు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్‌గానే సోఫియా లియోన్ (Sophia Leone) (26) అనే అడల్ట్ ఫిల్మ్ స్టార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలేంటో ఇంతవరకూ తెలియరాలేదు. ఇప్పుడు తాజాగా ఎమిలీ విల్లీస్ (Emily Willis) అనే మాజీ అడల్ట్ స్టార్ కోమాలోకి వెళ్లింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రీకారం చుట్టిన తరుణంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఏడాది క్రితం 'ఆప్'లో చేరిన నటి సంభావనా సేథ్ ప్రకటించారు. పార్టీలో చేరి పొరపాటు చేశానంటూ ఆమె వ్యాఖ్యానించారు.
సీనియర్ నటి, పొలిటీషియన్ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు మంగళవారంనాడు సంచలన ఆదేశాలు జారీ చేసింది. జయప్రదను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని, ఈనెల 27వ తేదీన కోర్టులో హాజరుపరచాలని సూపరింటెడెండ్ ఆఫ్ పోలీస్‌ని కోర్టు ఆదేశించింది.
నాగిన్ 5 ఫేమ్, టీవీ నటి సుర్భి చందనా(Surbhi Chandna) సోషల్ మీడియాలో ఓ ప్రముఖ విమానయాన సంస్థపై విమర్శలు గుప్పించింది. ఎందుకంటే ఆ ఎయిర్‌లైన్‌తో తనకు చాలా చేధు అనుభవం ఎదురైనట్లు చెప్పింది.