Share News

Narsipatnam Rural CI : నర్సీపట్నంలో వర్రా అరెస్టు

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:09 AM

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్‌ సీఐ రేవతమ్మ గురువారం తెలిపారు.

Narsipatnam Rural CI : నర్సీపట్నంలో వర్రా అరెస్టు

  • 14 రోజుల రిమాండ్‌.. విశాఖ జైలుకు తరలింపు

  • నర్సీపట్నంలో వర్రా అరెస్టు

నర్సీపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్‌ సీఐ రేవతమ్మ గురువారం తెలిపారు. ఆమె అందించిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్రరెడ్డి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ గత నెల 10వ తేదీన జిల్లాలోని నాతవరం పోలీస్‌ స్టేషన్‌లో లింగంపేట గ్రామానికి చెందిన దేవాడ అప్పలనాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, గుంటూరు జైలులో ఉన్న రవీంద్రరెడ్డిని పీటీ వారంట్‌పై తీసుకువచ్చి అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో వర్రాను విశాఖపట్నం సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Dec 06 , 2024 | 05:11 AM