Share News

Botsa Satyanarayana : ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి నిరసనలు

ABN , Publish Date - Dec 10 , 2024 | 06:25 AM

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.

Botsa Satyanarayana : ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి నిరసనలు

  • కంటైనర్‌ వ్యవహారంలో సీబీఐ తీరుపై మోదీ, షాలకు ఫిర్యాదు చేస్తా: బొత్స

విశాఖపట్నం, విజయనగరం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. లాసన్స్‌బే కాలనీలోని తన కార్యాలయంలోనూ, విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆయన సోదరుడు నివాసంలోనూ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలే అయినప్పటికీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైఫల్యాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీపరంగా ఒక కార్యాచరణ రూపొందించాం. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది. ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని కోరుతూ 13న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తాం.

ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, పెంచిన విద్యుత్‌ భారాన్ని తగ్గించాలని కోరుతూ 27న విద్యుత్తు పంపిణీ సంస్థల ఎస్‌ఈలకు, డిస్కమ్‌ల సీఈఓలకు వినతిపత్రాలు అందజేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలని కోరుతూ వచ్చే నెల 3న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడినట్లు భావిస్తే విచారణ జరిపి ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. పోర్టులో సీజ్‌ చేసిన కంటైనర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని హడావుడి చేయడంతోపాటు ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ... ఇప్పుడు అందులో డ్రగ్స్‌ లేవని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. దీనిపై నేను త్వరలోనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందజేస్తా’ అని బొత్స తెలిపారు.

Updated Date - Dec 10 , 2024 | 06:25 AM