Social Media Effect: ప్రతి ఇద్దరి పిల్లల్లో ఒకరు సోషల్ మీడియాకు బానిస.. ఓ సర్వేలో షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Nov 10 , 2024 | 10:31 AM
సోషల్ మీడియా పిల్లల జీవనశైలిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని వారి పేరెంట్స్ చెబుతున్నారు. అంతేకాదు అందుకోసం ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ సర్వే షాకింగ్ విషయాలను వెల్లడించింది.
నేటి కాలంలో ప్రతి ఇంట్లో దాదాపు 18 ఏళ్లలోపు పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే సోషల్ మీడియా(social media)లో యువత యాక్టివ్‌గా ఉండటం తప్పు కాదు. కానీ కొంత మంది పిల్లలు మాత్రం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు పిల్లలను కంట్రోల్ చేయలేక ఆందోళన చెందుతున్నారు. దేశంలోని ప్రతి ఇద్దరిలో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లేదా ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు బానిసలుగా మారుతున్నారని తాజాగా లోకల్ సర్కిల్స్ సర్వే అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల బాల్యం, చదువుపై ఇది ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా వారి మానసికి పరిస్థితిని కూడా దెబ్బతిస్తోంది.
అధ్యయనం ఏమి చెబుతుంది?
సోషల్ మీడియా పిల్లల జీవనశైలిపై స్పష్టంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. క్రమంగా ఇది వారి అభివృద్ధి. బాల్యాన్ని ప్రభావితం చేస్తోంది. స్థానిక స్థాయిలో ఈ విషయమై ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పట్టణ జనాభాలో 47 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రతిరోజూ మూడు గంటలకు పైగా సోషల్ మీడియా, OTT, రీల్స్ వీడియోలు మొదలైన వాటిపై గడుపుతున్నారని చెప్పింది. లోకల్ సర్కిల్స్ సర్వే అధ్యయనం ప్రకారం పట్టణ జనాభాలో ఉన్న ఇద్దరు తల్లిదండ్రులలో ఒకరు తమ పిల్లలు సోషల్ మీడియా, OTT, మొబైల్ గేమింగ్‌లకు బానిసలుగా మారారు.
ప్రతికూల ప్రభావం
ఇది క్రమంగా వారి ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వారు మరింత దూకుడుగా మారుతున్నారు. సోషల్ మీడియా అడిక్షన్ వల్ల పిల్లలు హింసాత్మకంగా మారడమే కాకుండా వారి ఓపిక, సహానం కొరవడుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో సోషల్ మీడియాపై కఠిన చట్టాలు తీసుకురావాలని ఆయా పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా, మొబైల్ గేమింగ్ విషయంలో దేశంలో కఠిన చట్టాలు ఉండాలని సర్వేలో 66 శాతం మంది తల్లిదండ్రులు చెప్పడం విశేషం.
ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి
చిన్న పిల్లల మొబైల్ ఫోన్‌లను డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద తల్లిదండ్రుల నియంత్రణలోకి తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ప్రభుత్వం నిబంధనలు లేదా చట్టాలు రూపొందించాలని కోరుతున్నారు. ఈ సర్వేలో పది శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరు గంటలకు పైగా మొబైల్ ఫోన్లను చూస్తున్నారని చెప్పారు.
గమనిక: వార్తలో అందించిన సమాచారం నివేదికల ఆధారంగా ఇవ్వడం జరిగింది. వీటి విషయంలో పిల్లలపై చర్యలు తీసుకునేందుకు మీరు నిపుణులను సంప్రదించడం మంచిది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: కేవలం రూ. 1200తో కోటీశ్వరులవ్వండి.. అందుకు ఎన్నేళ్లు పడుతుందంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Personal Finance: రూ. 2 కోట్లు సంపాదించాలంటే రోజు ఎంత పొదుపు చేయాలి..
PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..
Read More Business News and Latest Telugu News