Share News

Personal Finance: కేవలం రూ. 1200తో కోటీశ్వరులవ్వండి.. అందుకు ఎన్నేళ్లు పడుతుందంటే..

ABN , Publish Date - Nov 10 , 2024 | 09:35 AM

మీరు తక్కువ టైంలో కోటీశ్వరులు కావాలని భావిస్తున్నారా. అయితే ఈ వార్త చదవాల్సిందే. ప్రతి నెలా మీ జీతం నుంచి కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడులను పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలి, ఎంటనే వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Personal Finance: కేవలం రూ. 1200తో కోటీశ్వరులవ్వండి.. అందుకు ఎన్నేళ్లు పడుతుందంటే..
investment plans

మీరు తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావాలని చుస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే విషయంలో మీరు పదేళ్లలోనే కోటీశ్వరులు కావచ్చు. అది ఎలా సాధ్యం, దాని కోసం ఎంత సమయం పడుతుంది, ప్రతి నెల ఎంత మొత్తంలో పెట్టుబడి (investments) చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోటీశ్వరులు కావడానికి ప్రస్తుతం ఉన్న మార్గాల్లో మ్యూచువల్ ఫండ్స్‌ SIP ఎంపిక అనేది ఒక మంచి మార్గం. దీని ద్వారా మీరు ఈజీగా మిలియనీర్ కావచ్చు.


ఎంత సమయం పడుతుందంటే..

మీరు కేవలం 10 సంవత్సరాలలో మిలియనీర్ అవ్వాలనుకుంటే SIP కాలిక్యులేటర్ ప్రకారం ప్రతి నెలా రూ. 36000 పెట్టుబడి పెట్టాలి. దానిపై మీకు 15 శాతం రాబడి వస్తుందనుకుంటే 10 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే మొత్తం రూ. 1,00,31,662 అవుతుంది. ఈ 10 సంవత్సరాలలో మీరు చేసే మొత్తం పెట్టుబడి రూ. 43,20,000 కాగా, మీకు అదనంగా రూ. 57,11,662 ఆదాయం లభిస్తుంది. మీకు 15 శాతానికిపైగా రాబడి లభిస్తే ఇంకా ఎక్కువ మొత్తం వచ్చే ఛాన్స్ ఉంది.


SIP అంటే ఏంటి?

SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే మార్గం. ఇందులో మీరు సులభమైన వాయిదాలలో పెట్టుబడి చేయవచ్చు. దీని కోసం మీరు వారం, నెలవారీ, త్రైమాసిక లేదా ఆరు నెలల ప్రాతిపదికన పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవచ్చు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తం అవసరం లేదు. ఇందులో మీరు కనీసం రూ. 100 నుంచి పెట్టుబడులను ప్రారంభించవచ్చు. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.


ఎలా పెట్టుబడి చేయాలి

ఇందులో మీ బ్యాంక్ ఖాతా పెట్టుబడి ఖాతాకు లింక్ చేయబడింది. మీరు పెట్టుబడి కోసం ఎంచుకున్న ప్లాన్ ప్రకారం, నిర్దిష్ట తేదీలో ఆ ఖాతా నుంచి డబ్బు తీసివేయబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు KYC ప్రక్రియను పూర్తి చేయాలి. దీని కోసం మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవసరం. స్టాక్ మార్కెట్‌లోని ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టడం కంటే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయడం ద్వారా రిస్క్ తక్కువగా ఉంటుంది.


సిప్ ఖాతాలు ఎన్ని ఉన్నాయ్..

స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ SIP పై పెట్టుబడిదారుల విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటుంది. భారతదేశంలోని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ డేటా ప్రకారం ఆగస్టు 2022 నాటికి దేశంలో SIP ఖాతాల సంఖ్య 5.71 కోట్లుగా ఉంది. ఇది సెప్టెంబర్ 30, 2024 నాటికి 9.87 కోట్లకు చేరుకోవడం విశేషం.

గమనిక: సిప్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి తెలుపదు. సమాచారం మాత్రమే అందిస్తున్నాము. ఈ పెట్టుబడులు చేసే విషయంలో నిపుణుల సలహా సూచనలు తీసుకోవడం ఉత్తమం.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Personal Finance: రూ. 2 కోట్లు సంపాదించాలంటే రోజు ఎంత పొదుపు చేయాలి..

PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 10 , 2024 | 09:41 AM