Share News

WhatsApp: వామ్మో.. 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలను బ్యాన్ చేశారా.. అందరూ భారతీయులేనా..!

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:12 PM

సెప్టెంబర్‌లో 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలపై ఆ సంస్థ నిషేదం విధించింది. అందులోనూ అందరూ భారతీయులు కావడం విశేషం. అసలెందుకు బ్యాన్ చేశారంటే...

WhatsApp: వామ్మో.. 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలను బ్యాన్ చేశారా.. అందరూ భారతీయులేనా..!
WhatsApp

WhatsApp: సెప్టెంబర్‌లో 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలపై ఆ సంస్థ నిషేదం విధించింది. అందులోనూ అందరూ భారతీయులు కావడం విశేషం. ఐటీ రూల్స్ 2021 రూల్స్ అతిక్రమించడం, వాట్సప్ ను దుర్వినియోగం చేయడంతో ఈ చర్యలు తీసుకుంది. మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ అంటే తెలియని వారు ఉండరు. చిన్న పిల్లలు సైతం వాట్సప్‌ను యూజ్ చేస్తున్నారు. అయితే, ఈ కాలంలో మంచి కోసం ఉపయోగించాల్సిన ప్రతి యాప్ లను కూడా కొందరు వ్యక్తులు మిస్ యూజ్ చేస్తున్నారు. ఈ విషయంపై పోలీస్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు మాత్రం తమ దారి తమదేనంటూ వ్యవహరిస్తున్నారు. ఇక యాప్ లను మిస్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఆ సంస్థ సైతం కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది.


అందరూ భారతీయులేనా..!

ఈ క్రమంలోనే సెప్టెంబర్ లో 85 లక్షల మంది భారతీయుల ఖాతాలపై నిషేదం విధించింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం వాట్సప్ ను దుర్వినియోగం చేసినందుకు, నిబంధనలను అతిక్రమించినందుకు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక్క సెప్టెంబర్ లోనే ఏకంగా 85 లక్షల మంది ఖాతాలను బ్యాన్ చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. వీటిలో 16, 58,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా, ఐటీ నిబంధనలను ఉల్లించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.


సోషల్ మీడియాలో ఎక్కువగా వాడుతున్న యాప్ వాట్సప్. దాదాపు 600 మిలియన్లకు పైగా యూజర్స్ ఉన్నారు. వాట్సప్ లో ఎక్కువగా మెసేజులు పెట్టడం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడటం, ఎదైనా ఇన్ ఫర్మేషన్‌ను సెకండ్స్ లో పంపించడానికి ఈ యాప్ ను యూజ్ చేస్తారు. అయితే, ఈ యాప్ ను తప్పుడు సమాచారం ఇచ్చేందుకు యూజ్ చేయడంతో యూజర్లపై కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆగస్ట్ లో 84.58 లక్షల ఖాతాలపై వేటు వేయగా సెప్టెంబర్ లో 85 లక్షల మంది ఖాతాలపై నిషేదం విధించింది.


Also Read:

దేశీయ సూచీలకు భారీ నష్టాలు.. 79 వేల దిగువకు సెన్సెక్స్..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్‌ యాప్‌..

For more Business News and Telugu News

Updated Date - Nov 04 , 2024 | 12:12 PM