Share News

Anant Radhika Wedding: జామ్‌నగర్ చేరుకున్న అమీర్‌ఖాన్, అక్షయ్ కుమార్,.. అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:30 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Anant Radhika Wedding: జామ్‌నగర్ చేరుకున్న అమీర్‌ఖాన్, అక్షయ్ కుమార్,.. అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి

జామ్‌నగర్: ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు తరలివచ్చారు. ప్రముఖ బాలీవుడు నటుడు అమీర్ ఖాన్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగే జామ్‌నగర్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కైరా అద్వానీ, ఆదిత్యరాయ్ కపూర్, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్, అనన్య పాండే, అనిల్ కపూర్, సోనమ్ కపూర్, వరుణ్ ధావన్, సైఫ్ అలీఖాన్, కరీనా కపీర్, కరిస్మ కపూర్, మాధురి దీక్షిత్ తదితరులు ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగే జామ్‌నగర్ చేరుకున్నారు. కాగా నేటి నుంచి 3 రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి.


అలాగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు టీమిండియా క్రికెటర్లు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే జామ్ నగర్ చేరుకున్నాడు. అలాగే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్ కుటుంబసమేతంగా వేడుకలకు హాజరయ్యారు. వీరితోపాటు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు వచ్చారు. అలాగే ఈ వేడుకకు హాజరయ్యే వీవీఐపీల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్సిల్లా చాన్, ప్రఖ్యాత బార్బాడియన్ గాయని రిహన్న, మల్టీ-ఇన్‌స్ట్రుమెంటలిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్, బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, రాణి ముఖర్జీ తదితరులు ఉన్నారు. కాగా అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ఎంగేజ్‌మెంట్ గతేడాది జనవరిలో జరిగింది. జూలై 12న ముంబైలో వివాహం జరగనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 06:30 PM