Money Savings: 50 ఏళ్ల తర్వాత మీరు పని చేయాల్సిన అవసరం లేదు.. ఇలా చేస్తే మీ డబ్బే మిమ్మల్ని పోషిస్తుంది
ABN , Publish Date - Sep 15 , 2024 | 01:32 PM
మీరు కొన్నేళ్ల పాటు పొదుపు చేసి తర్వాత రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే దీనిలో 50 ఏళ్ల తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించి నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అంతేకాదు ప్రతి నెలా మీ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, మీ కార్పస్ తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలంటే ఏం చేయాలి, నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం అనేక మంది సేవింగ్స్ గురించి ప్లాన్ చేస్తుంటారు. మరికొంత మంది అయితే రిటైర్‌మెంట్ గురించి పొదుపు(savings) చేస్తారు. కానీ ఇంకొంత మంది మాత్రం తక్కువ వయస్సులో ఉన్నప్పుడే పొదుపు(investments) చేయడం ప్రారంభించి 50 ఏళ్ల వయస్సులోనే పదవీ విరమణ చేస్తారు. ఆ సమయంలో కూడా వారు ప్రతి నెలా రూ. 1 లక్ష వరకు పెన్షన్ పొందవచ్చు. అంతేకాదు ప్రతి నెలా ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, మీ కార్పస్ తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. అయితే మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలని చూస్తే, అందుకోసం ఏం చేయాలి, నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వడ్డీ రూపంలోనే
ఇందుకోసం సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (SWP) అనేది మంచి ఎంపిక. దీనిలో మీరు మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి క్రమం తప్పకుండా డబ్బును విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. SWP మీకు సాధారణ ఆదాయాన్ని ఇస్తుంది. దీంతోపాటు మీ డబ్బు కూడా పెరుగుతుంది. అయితే దీనిలో మీరు కొంచెం ప్రణాళికతో పెట్టుబడి పెడితే, మీరు ముందుగానే రిటైర్ అవ్వవచ్చు. ఆ తర్వాత మీరు భారీగా పెన్షన్ పొందుతూ మీ మొత్తం జీవితాన్ని హాయిగా గడపవచ్చు
ప్రతి నెలా
అందుకోసం మీరు 25 ఏళ్ల వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా రూ. 15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో సగటున 10-15 శాతం రాబడి అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ 10 శాతం సగటు రాబడిని పొందుతామని అనుకుంటే 25 సంవత్సరాలలో మీరు మొత్తం రూ. 45 లక్షలు పెట్టుబడి పెడతారు. దానిపై మీకు 1.55 కోట్ల రూపాయల వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా మీరు 50 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి దాదాపు రూ. 2 కోట్ల కార్పస్‌ను పొందే ఛాన్స్ ఉంటుంది.
విత్ డ్రా ఎంత?
ఈ క్రమంలో మీరు 50 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసి, ప్రతి నెలా రూ.1 లక్ష పెన్షన్ తీసుకోవడం ప్రారంభించవచ్చు. మీరు ఈ విధంగా చేస్తే మీ ఖాతాలో డబ్బు తగ్గుతుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. నిజానికి ఈ కాలంలో మీ డబ్బు తగ్గడానికి బదులుగా క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. మీరు 50 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి నెలా రూ. 1 లక్ష విత్‌డ్రా చేస్తే, తర్వాతి 20 ఏళ్లలో అంటే 70 ఏళ్ల వరకు, మీరు దాదాపు రూ. 2.40 కోట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు 20 సంవత్సరాల తర్వాత మీ ఖాతాను తనిఖీ చేసినప్పుడు, మీ మనీ తగ్గకుండా, డబ్బు పెరిగి దాదాపు రూ.3 కోట్లకు చేరుకుంటుంది.
ఉపసంహరించుకున్నప్పటికీ ఎలా పొందుతాము
ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నప్పటికీ తగ్గకుండా ఎందుకు పెరుగుతుందని చాలామంది అయోమయంలో ఉంటారు. వాస్తవానికి మీరు ఉపసంహరించుకునే డబ్బు మీ మొత్తం కార్పస్‌పై మీకు వచ్చే వడ్డీలో దాదాపు సగం. అంటే మీ కార్పస్‌కు సగం వడ్డీ ఇంకా జోడించబడుతోంది. మీరు వడ్డీని పొందుతున్నారు. అంటే రాబోయే సంవత్సరాల్లో దానిపై రాబడి ద్వారా మీ డబ్బు తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ప్లాన్ లో మీ వయస్సు 25 లేదా 30 ఏళ్ల ఉన్నప్పటి నుంచి సేవ్ చేసుకుంటే సులభంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Next Week IPOs: వచ్చే వారం మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..
Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..
Rain Alert: వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Neeraj Chopra: నీరజ్ చోప్రాకు మళ్లీ షాక్.. డైమండ్ లీగ్ టైటిల్ కొంచెంలో మిస్
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read MoreBusiness News and Latest Telugu News