Air Arabia: ఎయిర్ అరేబియా 'సూపర్ సీట్ సేల్' ఆఫర్.. ఇంకొన్ని రోజులు మాత్రమే
ABN , Publish Date - Oct 16 , 2024 | 02:51 PM
మీరు భారతదేశం నుంచి యూఏఈలోని పలు గమ్యస్థానాలకు వెళ్లాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఎయిర్ అరేబియా అతి తక్కువ ధరలకు పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఎయిర్ అరేబియా(Air Arabia) ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తన ప్లాట్‌ఫారమ్‌లో సూపర్ సీట్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రత్యేక సేల్ సమయంలో ఆసక్తిగల ప్రయాణికులు(passengers) తమ సీట్లను చాలా తక్కువ ధరకే రిజర్వ్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలకు అతి తక్కువ ధరల్లో సీట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని ఈ ఎయిర్ లైన్స్ కల్పిస్తోంది. అయితే ఈ సేల్ ముగిసేలోపు బుకింగ్ చేసుకుని ఉండాలి. ప్రయాణ తేదీ తప్పనిసరిగా నిర్దేశిత సమయ వ్యవధిలోనే ఉండాలి.
5 లక్షల సీట్లు
ఎయిర్ అరేబియా అనేది మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలోని ప్రముఖ తక్కువ ధర విమానయాన సంస్థ. ఈ నేపథ్యంలో సూపర్ సీట్ సేల్ ఆఫర్ ద్వారా 500,000 సీట్లపై భారీ తగ్గింపులను అందజేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అక్టోబర్ 20లోపు టిక్కెట్లను బుక్ చేసుకున్న వారి గమ్యస్థానాలకు రూ. 5,727 నుంచి పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ప్రమోషన్‌లో భాగంగా యూఏఈలోని అబుదాబి, షార్జా, రస్ అల్ ఖైమాలోని కొన్ని గమ్యస్థానాలకు భారతదేశం నుంచి విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించారు. ఇది కాకుండా టీబీలిసీ, బాకు, ఏథెన్స్, మిలన్, క్రాకో, మాస్కో, అల్మాటీ వంటి యూరోపియన్, ఆఫ్రికన్ దేశాలకు కూడా తక్కువ ధరలకు ఫ్లైట్స్ నడుపుతున్నట్లు వెల్లడించారు.
జర్నీ మాత్రం..
ఈ ప్రారంభ ఆఫర్ అక్టోబర్ 20, 2024 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందన్నారు. కానీ ప్రయాణ తేదీలు మాత్రం మార్చి 1, 2025 నుంచి అక్టోబర్ 25, 2025 వరకు ఉంటాయన్నారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, నాగ్‌పూర్, గోవా, చెన్నై, కోయంబత్తూర్, తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్‌లతో సహా పరిమిత సంఖ్యలో బయలుదేరే విమానాశ్రయాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే చౌకై ధరలకు టిక్కెట్లను పొందడానికి, విక్రయానికి సిద్ధం చేసిన ప్రత్యేక పేజీలో పేర్కొన్న కంపెనీ నిర్ణయించిన తేదీలలో మాత్రమే బుక్ చేసుకోవాలని గుర్తుంచుకోవాలి. మిగతా తేదీల్లో ప్రయాణిస్తే ఈ ఆఫర్లు వర్తించవు.
ఈ ఆఫర్ కింది భారతదేశ నగరాల్లోని విమానాశ్రయాల్లో అందుబాటులో ఉంది
ఢిల్లీ
ముంబై
కోల్‌కతా
అహ్మదాబాద్
బెంగళూరు
హైదరాబాద్
జైపూర్
నాగపూర్
గోవా
చెన్నై
కోయంబత్తూరు
తిరువనంతపురం
కొచ్చి
కోజికోడ్
ఇవి కూడా చదవండి:
Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..
Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్
BSNL: ఎయిర్‌టెల్, జియోకు బీఎస్ఎన్ఎల్ సవాల్.. రూ.6కే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటా
Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News