Share News

All Banks Half Day: అన్ని బ్యాంకులు జనవరి 22న హాఫ్ డే..తర్వాత మూడు రోజులు సెలవు!

ABN , Publish Date - Jan 19 , 2024 | 04:38 PM

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. ఈ సందర్భంగా జనవరి 22న అయోధ్యలో అన్ని బ్యాంకులు హాఫ్ డే మాత్రమే పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

All Banks Half Day: అన్ని బ్యాంకులు జనవరి 22న హాఫ్ డే..తర్వాత మూడు రోజులు సెలవు!

అయోధ్య(ayodhya)లో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. ఈ సందర్భంగా జనవరి 22న అయోధ్యలో అన్ని బ్యాంకులు హాఫ్ డే(All Banks Half Day) మాత్రమే పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు కూడా జనవరి 22న మధ్యాహ్నం 2:30 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: 2,840 విమానాలు.. 41,000 పైలెట్లు అవసరం

ఇప్పటికే దేశవ్యాప్తంగా రామమందిర ప్రతిష్ఠాపన కోసం ముమ్మరంగా సన్నాహాలు కొనసాగుతున్నాయి. జనవరి 22న జరగనున్న ఈ గ్రాండ్ వేడుకకు దేశంలోని ప్రత్యేక అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ రామ మందిర వేడుకలో ఎక్కువ మంది ప్రజలను భాగస్వాములను చేయడానికి, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు జనవరి 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ప్రకటించింది. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా అక్కడి అన్ని ప్రభుత్వ బ్యాంకులకు జనవరి 22 మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ప్రకటించింది.

జనవరి నెలలో చివరి లాంగ్ వీకెండ్ వచ్చే వారంలో రాబోతోంది. అయితే ఈ వారంలోనే జనవరి 26న శుక్రవారం రిపబ్లిక్ డే సెలవుదినం. నాల్గవ శనివారం కావడంతో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు, ఇక ఆదివారం కూడా బ్యాంకులు మూసివేయబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.

Updated Date - Jan 19 , 2024 | 04:38 PM