Share News

Sales Force: మరో టెక్ కంపెనీలో 700 మంది ఉద్యోగుల తొలగింపు..కారణమిదేనా?

ABN , Publish Date - Jan 26 , 2024 | 04:30 PM

ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతున్న క్రమంలోనే మరో కంపెనీ వారి ఉద్యోగులకు షాకిచ్చింది. ప్రముఖ గ్లోబల్ టెక్ సంస్థ సేల్స్‌ఫోర్స్ దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు వచ్చాయి.

Sales Force: మరో టెక్ కంపెనీలో 700 మంది ఉద్యోగుల తొలగింపు..కారణమిదేనా?

ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతున్న క్రమంలోనే మరో కంపెనీ వారి ఉద్యోగులకు షాకిచ్చింది. ప్రముఖ గ్లోబల్ టెక్ సంస్థ సేల్స్‌ఫోర్స్(sales force) దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు వచ్చాయి. దీంతో 2024లో ఉద్యోగాలను తగ్గించే కంపెనీల జాబితాలో ఈ సంస్థ కూడా చేరింది. ప్రస్తుతం ఈ కంపెనీలో మొత్తం 70,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఒక శాతం మందిని తొలగించినట్లు తెలిసింది. దీంతోపాటు ఇప్పటికే గూగుల్, ట్విచ్, అమెజాన్ తర్వాత 2024లో తన ఉద్యోగులను తగ్గించిన నాల్గవ టెక్ సంస్థగా ఈ కంపెనీ అవతరించింది. మరోవైపు 2023లో ఈ కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను తొలగించింది.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Budget 2024: ఈ స్టాక్‌లలో పెరుగుదల ఉంటుందా... పెట్టుబడి పెట్టాలా వద్దా?

WSJ ప్రకారం సేల్స్‌ఫోర్స్ గత సంవత్సరం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. కోవిడ్ మహమ్మారి తరువాత ఏర్పడిన మాంద్యం కారణంగా దీని అమ్మకాలపై ప్రభావితం పడింది. ఇలియట్ మేనేజ్‌మెంట్‌తో సహా అనేక మంది పెట్టుబడిదారులు ఈ కంపెనీలో వాటాలను కొనుగోలు చేశారు. వేగవంతమైన మార్జిన్‌లను మెరుగుపరచడానికి కంపెనీ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తెచ్చారు. సేల్స్‌ఫోర్స్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే తొలగింపులు, స్కేలింగ్ బ్యాక్, ఖర్చులను తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

12,000 మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించినట్లు ఈ నెల ప్రారంభంలో గూగుల్ ప్రకటించింది. అమెజాన్ తన బై విత్ ప్రైమ్ యూనిట్ నుంచి 30 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇది కాకుండా ట్విచ్ కూడా ఇప్పటికే 500 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో మరింత భయాందోళన మొదలైంది. తమ ఉద్యోగాలు కూడా ఉంటాయా లేదా ఊడుతాయా అనే సందిగ్ధంలో ఉన్నారు.

Updated Date - Jan 26 , 2024 | 04:30 PM