Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌కు ఎక్కువ మనీ అడుగుతున్నారా.. ఇలా ఫిర్యాదు చేయండి
ABN , Publish Date - Dec 12 , 2024 | 04:52 PM
దేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. అయితే దీనిని ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆధార్ సేవా కేంద్రాల్లో ఎక్కువ మనీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి వాటి విషయంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
myAadhaar పోర్టల్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ (Aadhaar Update) చేసుకునేందుకు చివరి తేదీ దగ్గర పడింది. డిసెంబర్ 14, 2024 వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇదే అదునుగా భావించిన కొన్ని ఆధార్ కేంద్రాలలో పలువురు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం దగ్గర పడిందని ఎక్కువ డబ్బులు తీసుకోవద్దని అంటున్నారు. అయితే ఇలా ఎవరైనా ఎక్కువ మనీ తీసుకుంటే మీరు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
డిమాండ్ చేస్తే
ఆధార్ అప్‌డేట్ కోసం UIDAI ఇప్పటికే ప్రత్యేక రుసుమును నిర్ణయించింది. మీరు మీ ఆధార్ కార్డ్‌లోని జనాభా వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే, మీరు దీనికి రూ. 50 మాత్రమే చెల్లించాలి. ఇది కాకుండా బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి మీరు రూ. 100 చెల్లించాలి. ఈ మొత్తాలు కాకుండా మీరు ఎక్కువ చెల్లించాలని డిమాండ్ చేస్తే వారిపై కంప్లైంట్ చేయవచ్చు. దీని కోసం మీరు UIDAI టోల్ ఫ్రీ నంబర్ 1947కి కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత, మీరు వెళ్లిన ఆధార్ సేవా కేంద్రానికి సంబంధించి పూర్తి వివరాలను, ఆధార్ సేవా కేంద్రంలో కూర్చున్న అధికారి మీ నుంచి ఎంత ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నారో తెలియజేయాలి.
ఫిర్యాదును ఎలా నమోదు చేయాలి
అయితే మీరు ఫిర్యాదు చేసే సమయంలో సమాచారం మొత్తం తెలియజేయాలి. ఆ తర్వాత మీ ఫిర్యాదు నమోదు చేయబడుతుంది. ఫిర్యాదు అనంతరం విచారణ చేపడతారు. విచారణలో మీ మాటలు నిజమని తేలితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటారు.
ఈ నంబర్‌కు
ఇలాంటి క్రమంలో మీరు ఏదైనా ఆధార్ కేంద్రానికి వెళ్లినప్పుడు ముందుగా మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి ఎంత రుసుము తీసుకుంటారో తెలుసుకోండి. ఎవరైనా నిర్ణీత రుసుము కంటే ఎక్కువ అడిగితే, అటువంటి పరిస్థితిలో మీరు uidai.gov.inకి మెయిల్ పంపడం ద్వారా లేదా 1947 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీ విషయంలో ఎక్కువ మొత్తం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు వారు చేస్తున్న తప్పులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
స్కూళ్లలో పిల్లల ఆధార్ కూడా..
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డ్ మనకు ముఖ్యమైన పత్రంగా మారింది. దాదాపు ప్రతి పనికి ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారు. మీరు బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలన్నా లేదా ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలన్నా, ప్రతిచోటా ఆధార్ కార్డు తప్పనిసరి. స్కూల్ అడ్మిషన్ సమయంలో కూడా కొన్ని స్కూళ్లలో పిల్లల ఆధార్ కార్డును అడుగుతున్నారు. అందువల్ల ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఇవి కూడా చదవండి:
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Read More Business News and Latest Telugu News