Share News

Rapido: రూ.675 కోట్ల నష్టాల్లో బైక్ స్టార్టప్ ర్యాపిడో

ABN , Publish Date - Jan 14 , 2024 | 03:16 PM

బైక్ ట్యాక్సీ స్టార్టప్ Rapido సంస్థకు కష్టాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరంలో (FY23) దాదాపు 54 శాతం నష్టాలు పెరిగి రూ.675 కోట్లకు చేరుకున్నాయి.

Rapido: రూ.675 కోట్ల నష్టాల్లో బైక్ స్టార్టప్ ర్యాపిడో

బైక్ ట్యాక్సీ స్టార్టప్ Rapido సంస్థకు కష్టాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరంలో (FY23) దాదాపు 54 శాతం నష్టాలు పెరిగి రూ.675 కోట్లకు చేరుకున్నాయి. ఇవి FY22లో రూ.439 కోట్లు ఉండటం విశేషం. అయితే రాపిడో నష్టాలు పెరగడం వెనుక రైడర్ల వ్యయం, IT సహా పలురకాల ఉద్యోగుల ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. రైడర్‌లకు చెల్లించే ప్రోత్సాహకాలు, ఛార్జీలు మొత్తం వ్యయంలో 44 శాతంగా ఉన్నాయని ఎంట్రాకర్ నివేదిక తెలిపింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: 5G Smartphones: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్!

అదే సమయంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ఆర్థిక నివేదికల ప్రకారం కార్యకలాపాల ద్వారా స్టార్టప్ ఆదాయం FY22లో రూ.145 కోట్ల నుంచి FY23లో 3 రెట్లు పెరిగి రూ.443 కోట్లకు చేరుకుందని తెలిపింది. దీంతోపాటు ఈ స్టార్టప్ గత నెలలో క్యాబ్ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బైక్ టాక్సీలలో 60 శాతం మార్కెట్ వాటాతో స్టార్టప్ రాపిడో క్యాబ్స్‌తో మార్కెట్‌ను విస్తరించాలని చూస్తోంది. 2015లో స్థాపించబడిన Rapido ఇప్పుడు 100కి పైగా నగరాల్లో పనిచేస్తోంది. 25 మిలియన్లకు పైగా యాప్ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.

Updated Date - Jan 14 , 2024 | 03:16 PM