Share News

EMIs Rates Hike: ఈ కస్టమర్లకు షాక్ ఇచ్చిన బ్యాంకులు.. లోన్ ఈఎంఐలు పెంపు

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:03 PM

ఇటివల కాలంలో పలు బ్యాంకుల్లో(banks) రుణాలు తీసుకుని EMIలు తగ్గుతాయని చూస్తున్న కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వరుసగా 9వ సారి MPCలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. కానీ దేశంలోని మూడు బ్యాంకులు మాత్రం తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్‌ రేట్లను(MCLR) పెంచుతున్నట్లు ప్రకటించాయి.

EMIs Rates Hike: ఈ కస్టమర్లకు షాక్ ఇచ్చిన బ్యాంకులు.. లోన్ ఈఎంఐలు పెంపు
loan EMIs hike

ఇటివల కాలంలో పలు బ్యాంకుల్లో(banks) రుణాలు తీసుకుని EMIలు తగ్గుతాయని చూస్తున్న కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వరుసగా 9వ సారి MPCలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. కానీ దేశంలోని మూడు బ్యాంకులు మాత్రం తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్‌ రేట్లను(MCLR) పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఆ క్రమంలో మూడు బ్యాంకులు వేర్వేరు కాలాలకు వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలు మరింత ఖరీదైనవిగా మారాయి. అయితే MCLR రేట్లను పెంచిన బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, UCO బ్యాంక్, కెనరా బ్యాంకులు ఉన్నాయి.


బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లను మార్చింది. ఈ క్రమంలో బ్యాంక్ ఓవర్ నైట్ MCLR 8.15, ఒక నెల MCLR 8.35 శాతానికి, మూడు నెలల MCLR 8.50 శాతానికి, ఆరు నెలల MCLR 8.75 శాతానికి, ఒక సంవత్సరం MCLR 8.95 శాతానికి చేరుకుంది. ఈ బ్యాంక్ కొత్త రేట్లు ఆగస్టు 12, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.


కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ కూడా తన MCLRలో మార్పులను ప్రకటించింది. బ్యాంక్ తన అన్ని పదవీకాల వడ్డీ రేట్లలో 5 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరుగుదల తర్వాత ఓవర్ నైట్ MCLR 8.20 శాతం నుంచి 8.25 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఒక నెల కాలానికి MCLR 8.30 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది. మూడు నెలల కాలానికి ఎంసీఎల్‌ఆర్ 8.40 శాతం నుంచి 8.45 శాతంగా ఉంది.

ఆరు నెలలకు ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.75 శాతం నుంచి 8.80 శాతానికి, ఏడాది కాలానికి 8.95 శాతం నుంచి 9.00 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 9.25 శాతం నుంచి 9.30 శాతానికి, మూడేళ్లకు ఎంసీఎల్‌ఆర్‌ 9.35 శాతం నుంచి 9.40 శాతంకు పెరిగింది. ఈ రేట్ల మార్పు తర్వాత కస్టమర్ల హోమ్ లోన్ EMI, కార్ లోన్ EMI మొదలైన వాటిలో పెరుగుదల ఉంటుంది. ఇవి కూడా ఆగస్టు 12, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.


UCO బ్యాంక్

ప్రభుత్వ రంగ UCO బ్యాంక్ కూడా తన వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దాని MCLR తో పాటు బ్యాంక్ ఇతర బెంచ్ మార్క్ రేట్లను కూడా పెంచింది. బ్యాంక్ ఓవర్ నైట్ MCLR 8.20 శాతానికి, ఒక నెల MCLR 8.35 శాతానికి, మూడు నెలల MCLR 8.50 శాతానికి, ఆరు నెలల MCLR 8.80 శాతానికి, ఒక సంవత్సరం MCLR 8.95 శాతానికి చేరుకుంది. బ్యాంకు ఒక నెల MCLR 6.85 శాతం నుంచి 6.7 శాతానికి పెరగగా, ఒక సంవత్సరం TBLR 6.85 శాతానికి చేరుకుంది. మిగిలిన రేట్లలో బ్యాంక్ ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త రేట్లు ఆగస్టు 10, 2024 నుంచి అమలులోకి వచ్చాయి.


ఇవి కూడా చదవండి:

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 10 , 2024 | 04:05 PM