BSNL: ఎయిర్‌టెల్, జియోకు బీఎస్ఎన్ఎల్ సవాల్.. రూ.6కే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటా
ABN , Publish Date - Oct 14 , 2024 | 02:54 PM
మీరు Jio, Airtel, Vi వంటి కంపెనీల పెరిగిన రీఛార్జ్ ధరలతో విసిరిపోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే BSNL చౌక ధరల్లో అదిరిపోయే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి.
ముఖేష్ అంబానీ జియో, సునీల్ మిట్టల్‌కు చెందిన ఎయిర్ టెల్ సంస్థలకు BSNL పెద్ద సవాల్ చేస్తోంది. ఎందుకంటే అతి తక్కువ ధరల్లో రిఛార్జ్ ప్లాన్ ధరలను ప్రకటించి అనేక మంది యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే రోజుకు రూ.6కే 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ వంటి అనేక సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో 2GB డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం 105 రోజుల పాటు ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. రోజుకు రూ.7లోపే ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్ 105 రోజుల చెల్లుబాటుతో అందుబాటులోకి వచ్చింది. దీనిలో వినియోగదారులు ప్రతిరోజూ 2GB డేటాను పొందుతారు.
మిగతావి మాత్రం..
దీంతో పాటు 100 ఉచిత SMSలు, అపరిమిత కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో మొత్తం 210 జీబీ డేటా అందుబాటులో ఉండగా, దీని ధర రూ. 666. దీనిని BSNL 'సిక్సర్ ప్లాన్' అని కూడా పిలుస్తారు. కంపెనీ దీనిని మొదటిసారిగా 2017లో తీసుకొచ్చింది. జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే ఈ BSNL ప్లాన్ చాలా తక్కువ ధరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మూడు నెలల కంటే ఎక్కువ కాలపరిమితితో అందుబాటులో ఉంది. ఇంత వాలిడిటీ ఉన్న జియో, ఎయిర్‌టెల్ ప్లాన్‌లు చాలా ఖరీదైనవిగా ఉండటం విశేషం.
కొన్ని నెలల్లోనే
గత కొన్ని నెలల్లో లక్షల మంది వినియోగదారులు BSNLకి మారారు. Jio, Airtel, Vodafone Idea (Vi) ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌ల కారణంగా వినియోగదారులు ఇప్పుడు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్లాన్ మీకు 3.5 నెలల పాటు రీఛార్జ్ ఒత్తిడి నుంచి విముక్తిని ఇస్తుంది. దీంతో ఇకపై ప్రతి నెల రిఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ప్లాన్ మాత్రమే కాదు బీఎస్ఎన్ఎల్ ఇటివల ప్రవేశపెట్టిన అనేక ప్లాన్లు కూడా జియో, ఎయిర్‌టెల్, వీఐలతో పోలిస్తే తక్కువ ధరల్లో ఉండటం విశేషం.
5జీపై ఫోకస్
మరోవైపు BSNL ఇప్పటికే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై పూర్తి దృష్టి పెడుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 5జీ, 4జీ కనెక్టివిటీని మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 24,000 టవర్ల కంటే లక్ష మొబైల్ టవర్లను 4G సర్వీస్‌తో అమర్చడం ద్వారా మౌలిక సదుపాయాలను విస్తరించే ప్రణాళికలను కంపెనీ వివరించింది. ఇది కాకుండా గత కొన్ని నెలలుగా కంపెనీ కస్టమర్లు కూడా గణనీయంగా పెరిగారు.
ఇవి కూడా చదవండి:
Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్
Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
Read More Business News and Latest Telugu News