Budget 2024: సంస్కరణపథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి.. నిర్మలమ్మ
ABN , Publish Date - Feb 01 , 2024 | 11:20 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. దేశ ప్రజలు భవిష్యత్తు వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా నిర్మలా అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2014లో ప్రధాని మోదీ పని ప్రారంభించినప్పుడు చాలా సవాళ్లు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అనేక పనులను ప్రారంభించామని చెప్పారు. ప్రజలకు గరిష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు. దేశంలో కొత్త లక్ష్యం, ఆశలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు మమ్మల్ని నమ్మి రెండోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. అందరి మద్దతు, అందరి విశ్వాసం, అందరి కృషి అనే మంత్రంతో ముందుకు సాగుతామని తెలిపారు.
ఈ బడ్జెట్‌లో మూడు నెలల పాటు ఖర్చు చేయాల్సిన మొత్తం లెక్కను ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్ రానుంది. అంతకుముందు మంత్రివర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ అందరికీ మేలు చేస్తుందని అన్నారు.