Union Cabinet: దేశంలో ఐదో సెమీకండక్టర్ యూనిట్‌కు క్యాబినెట్ ఆమోదం.. ఏర్పాటు ఇక్కడే..
ABN , Publish Date - Sep 02 , 2024 | 05:45 PM
రూ.3,300 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని సనంద్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న కీన్స్ సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ యూనిట్ రోజుకు 60 లక్షల చిప్‌లను ఉత్పత్తి చేయనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ప్రతి పరికరాన్ని 'మేడ్ ఇన్ ఇండియా'లో తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే చిప్‌లను దేశీయంగా అభివృద్ధి చేసే కల త్వరలోనే నెరవేరనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి చిప్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే 1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు మార్చిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) కింద గుజరాత్(Gujarat)లోని సనంద్(Sanand)లో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనే కీన్స్ సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం(Cabinet approves) సోమవారం ఆమోదించింది.
గుజరాత్‌లోనే
సనంద్(Sanand)లో సెమీకండక్టర్ సెక్టార్ కోసం ఆమోదించబడిన రెండో ప్రతిపాదన ఇది. అంతకుముందు జూన్ 2023లో గుజరాత్‌లోని సనంద్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనే మొదటి ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం(Cabinet approves) ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 2024లో మరో మూడు సెమీకండక్టర్ యూనిట్లు ఆమోదించబడ్డాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో ఐదు సెమీకండక్టర్ యూనిట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్, అస్సాంలోని మోరిగావ్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. సీజీ పవర్ సనంద్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ను నిర్వహిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది.
76 వేల కోట్లతో
3,300 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదిత యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచార ప్రసార, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయంపై సమాచారం ఇచ్చారు. ఈ నాలుగు యూనిట్లు దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురానున్నాయి. ఈ యూనిట్ సామర్థ్యం రోజుకు 60 లక్షల మైక్రో చిప్‌లు. ఈ సదుపాయంలో ఉత్పత్తి చేయబడిన చిప్‌లు పారిశ్రామిక, ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, మొబైల్ ఫోన్‌లతో పాటు ఇతర రంగాలకు చెందిన అనేక రకాల అప్లికేషన్‌లను అందిస్తాయి. సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీ యూనిట్ల కోసం అభివృద్ధి చేసే పథకం మొత్తం రూ. 76 వేల కోట్లతో డిసెంబర్ 21, 2021న నోటిఫై చేశారు.
ఈ ఏడాది చివరి నాటికి
అమెరికన్ చిప్ మేకర్ మైక్రాన్ గుజరాత్‌లోని సనంద్‌లో హై ఎండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్. ఇది భారతదేశంలోనే మొదటిది. ఇది 2024 చివరిలో ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. గుజరాత్, అస్సాంలోని రెండు ప్లాంట్లలో సెమీకండక్టర్స్ చిప్‌ల వాణిజ్య ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుందని టాటా గ్రూప్ భావిస్తోంది. మొత్తంగా నాలుగు సెమీకండక్టర్ యూనిట్ల పని ప్రస్తుతం జరుగుతోంది. గుజరాత్‌లో 3, అస్సాంలో 1. ఆధునిక సమాజానికి సెమీకండక్టర్లు కీలకమైనవి. ఫోన్‌లు, వైద్య పరికరాలు, కార్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో సహా అనేక రకాల పరికరాల తయారీకి ఇవి చాలా అవసరం. మీడియా నివేదికల ప్రకారం మొత్తం తయారీ సామర్థ్యంలో ప్రస్తుతం 70 శాతం దక్షిణ కొరియా, తైవాన్, చైనా, US, జపాన్ దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంది.
ఇవి కూడా చదవండి:
Tata Curve ICE: రూ.9 లక్షలకే కొత్త మోడల్ కార్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Madhabi Puri Buch: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు.. 3 చోట్ల జీతం తీసుకుంటున్నారని ఆరోపణ
Next Week IPOs: ఈ వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి
Read More Business News and Latest Telugu News