Share News

Penny Stocks: ఏడాది క్రితం రూ.10 వేల పెట్టుబడి..ఇప్పుడు లక్షా 20 వేల ఆర్జన

ABN , Publish Date - Jan 20 , 2024 | 05:21 PM

కొంతమంది మదుపర్లు ఓ చిన్న కంపెనీలో ఏడాది క్రితం 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం అవి కాస్తా వారికి కాసుల వర్షం కురిపించాయి. ఏకంగా వారికి 1150 శాతం లాభాలు వచ్చాయి. అయితే అసలు ఆ సంస్థ ఏంటి, స్టాక్ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Penny Stocks: ఏడాది క్రితం రూ.10 వేల పెట్టుబడి..ఇప్పుడు లక్షా 20 వేల ఆర్జన

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలను గడించాలని అనేక మంది భావిస్తుంటారు. చాలా మందికి మన దేశంలో దీనిపై అవగాహన తక్కువగా ఉంటుంది. ఏ షేర్లలో పెట్టుబడి పెట్టాలి, ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలనే దానిపై క్లారిటీ ఉండదు. అయితే ఆర్థిక నిపుణుల సూచనలు తీసుకుని దీర్ఘకాలం లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయడం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు. కొన్ని షేర్లలో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ కాలంలోనే మంచి లాభాలను దక్కించుకోవచ్చు. అందుకు ఉదాహరణే ceenik exports india స్టాక్ అని చెప్పవచ్చు.

ఈ స్టాక్ గత 12 నెలల్లోనే పెట్టుబడి దారులకు ఏకంగా 1150 శాతం లాభాలను అందించింది. జనవరి 2023లో ఈ కంపెనీ షేర్ ధర రూ.12.35 ఉండగా...ప్రస్తుతం శనివారం రూ.150.65 వద్ద ముగిసింది. దీని గత ముగింపు ధర 147.70తో పోలిస్తే ఇది 2.00% ఎక్కువ. గత ఏడాది కాలంలో ఈ పెన్నీ స్టాక్ సీనిక్ ఎక్స్‌పోర్ట్స్ షేర్ ధరలు ఏకంగా 1100 శాతానికిపైగా పెరిగాయి. ఈ లెక్కన చూస్తే ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ కంపెనీ షేర్లలో రూ.10,000 పెట్టుబడి చేస్తే అతనికి రాబడి రూ.1.19 లక్షలు వచ్చిందని చెప్పవచ్చు.


శనివారం(jan 20th) ఉదయం కంపెనీ షేర్లు రూ.150.60 స్థాయికి చేరుకున్నాయి. దీంతో 52 వారాల కనిష్ట స్థాయి రూ.9.76 (ఏప్రిల్ 2023) నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లు 1413 శాతం పెరిగాయి. జనవరిలోనే కంపెనీ షేర్లు 34 శాతంకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 2023 నుంచి జనవరి 2024 వరకు కంపెనీ షేర్ల ధర 1118 శాతంకు చేరాయి. సెప్టెంబర్ నెలలో కంపెనీ షేర్ల ధర 103.50 శాతంకు చేరింది. ఆ క్రమంలో పొజిషనల్ ఇన్వెస్టర్లు నవంబర్‌లో 51 శాతం లాభపడ్డారు. ఈ కంపెనీ 1995లో స్థాపించబడింది.

Updated Date - Jan 20 , 2024 | 05:25 PM