Share News

Viral News: మీటింగ్‌కు రాలేదని 90% ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. నెటిజన్ల కామెంట్స్

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:04 PM

తప్పనిసరిగా హాజరుకావాల్సిన సమావేశానికి ఉద్యోగులు రాలేదని ఓ కంపెనీ సీఈఓ ఏకంగా 90% మందిని తొలగించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: మీటింగ్‌కు రాలేదని 90% ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. నెటిజన్ల కామెంట్స్
CEO Baldwin fired 90%

గత కొన్ని నెలలుగా ప్రముఖ టెక్ కంపెనీలలో లే ఆఫ్స్ ట్రెండ్ కొనసాగుతుంది. వందల మంది ఉద్యోగులను ప్రతినెలా తీసేస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా ఓ కంపెనీ సీఈఓ కూడా 90 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. కానీ ఆ కారణం తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. తప్పనిసరిగా హాజరుకావాల్సిన మీటింగ్‌కు రాని వారైన దాదాపు 90 శాతం ఉద్యోగులను ఆయన తొలగించారు. ఈ సంఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంది.


ఈ విషయంలో విఫలమైనందుకు

ఓ US కంపెనీ CEO అయిన బాల్డ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరి సమావేశానికి హాజరు కావడంలో విఫలమైనందుకు 99 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం Redditలో పోస్ట్ చేశారు. ఈ ఉదయం మీటింగ్‌కి రాని వారి కోసం అధికారిక నోటీసుగా పంపిస్తున్నాము. మీరందరూ తొలగించబడ్డారు. మీరు అంగీకరించిన వాటిని చేయడంలో విఫలమయ్యారు. కాంట్రాక్ట్‌లో మీ భాగాన్ని పూర్తి చేయడంలో కూడా సక్సెస్ కాలేదన్నారు. తప్పనిసరిగా హాజరు కావాల్సిన సమావేశాలకు రాలేదని స్లాక్ సందేశంలో CEO తెలిపారు.

us team.jpg


తిరిగి ఇవ్వాలని వెల్లడి

ఉదయం జరిగిన సమావేశంలో 110 మందిలో 11 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. దీంతో ఆ 11 మంది మాత్రమే సంస్థలో ఉంటారని, మిగిలిన వారు తొలగించబడ్డారని ఆయన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు దయచేసి మీ వద్ద ఏదైనా సంస్థకు సంబంధించినవి ఉంటే తిరిగి ఇవ్వాలని, అన్ని ఖాతాల నుంచి సైన్ అవుట్ చేయాలని కోరారు. దీంతో CEO బాల్డ్విన్ తీసుకున్న నిర్ణయం గురించి ఆన్‌లైన్‌లో పెద్ద చర్చ మొదలైంది. ఇది తెలిసిన ఓ వ్యక్తి 99 మంది నిజంగా పనిచేస్తున్నారని ఊహిస్తున్నట్లు కామెంట్ చేయగా, మరో వ్యక్తి మాత్రం మంచి పని చేశారని అంటున్నారు.


గతంలో కూడా..

ఇంకో వ్యక్తి మాత్రం మిగిలిన 11 మందిని సీఈఓ కొంత కాలం పాటు చాలా ఇబ్బంది పెడతారని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడతారని, కనీసం వారికి అడ్వాన్స్ పే చేయాలని మరికొంత మంది చెబుతున్నారు. ఆ సమావేశం గురించి బృందానికి తెలియజేయడంలో CEO విఫలమయ్యారని అనుకుంటున్నట్లు మరో వ్యక్తి అన్నారు. ఇదొక్కటే కాదు గతంలో కూడా జూమ్ వీడియో ద్వారా యునికార్న్ మార్ట్‌గేజ్ లెండర్ స్టార్టప్ సీఈఓ 900 మంది ఉద్యోగులను తొలగించారు. అప్పుడు ఆయన కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఈ సీఈఓలు తీసుకున్న నిర్ణయాలు సరియైనవేనా కాదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.


ఇవి కూడా చదవండి:

Rupee: డాలర్‌తో పోల్చితే డేంజర్ జోన్‌లో రూపాయి.. కారణమిదేనా..


PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Viral News: లష్కరే తోయిబా అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్.. తర్వాత ఏమైందంటే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 18 , 2024 | 12:06 PM