Share News

Iran President: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి.. చమురు, గోల్డ్, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం?

ABN , Publish Date - May 20 , 2024 | 05:49 PM

ఇరాన్ అధ్యక్షుడు(Iran President) ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి మరణం చమురు మార్కెట్లలో అస్థిరతను కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతోపాటు పెట్టుబడిదారుల చమురు(fuel) ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

Iran President: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి.. చమురు, గోల్డ్, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం?
Death Irans President Raisi Impact fuel and gold stock market

ఇరాన్ అధ్యక్షుడు(Iran President) ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి మరణం చమురు మార్కెట్లలో అస్థిరతను కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతోపాటు పెట్టుబడిదారుల చమురు(fuel) ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆసియా మార్కెట్లలో రైసీ మరణ వార్త తర్వాత చమురు ధరలు పెరిగినట్లు గుర్తు చేశారు.


దీంతోపాటు ఇది స్టాక్ మార్కెట్(stock market), బంగారం(gold) ధరలుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఇరాన్ నాయకత్వం అనిశ్చితి చమురు మార్కెట్లో అస్థిరతకు దారితీయవచ్చని అన్నారు. ఎందుకంటే ఇరాన్ చమురు ఉత్పత్తి, ఎగుమతుల గురించి పెట్టుబడిదారులు ఆందోళన చెందుతారని ప్రస్తావించారు. అయితే ఇరాన్ చమురు ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడితే అది ప్రపంచ చమురు సరఫరాలు, ధరలపై కూడా ప్రభావం చూపుతుంది.

ఎందుకంటే ఇరాన్ ప్రధాన చమురు ఉత్పత్తి దేశంగా ఉంది. ఇక్కడ ఉత్పత్తి, సరఫరా తగ్గితే ఈ దేశంపై ఆధారపడిన మిగతా దేశాల ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆంక్షలలో ఉన్నందున భారతదేశం ప్రస్తుతం ఇరాన్ చమురును దిగుమతి చేసుకోవడం లేదు. ప్రధాన కొనుగోలుదారుల్లో చైనా సహా పలు దేశాలు ఉన్నాయి.


మరోవైపు ప్రపంచంలో భౌగోళిక రాజకీయ అస్థిరత్వం ఉన్నప్పుడల్లా బంగారానికి(gold) డిమాండ్ పెరుగుతుంది. దీంతో బంగారం ధరలు పెరగనున్నాయని నిపుణులు చెబుతున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ మరణించిన తర్వాత గ్లోబల్ బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. కామెక్స్‌లో అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకు 1.17 శాతం లేదా 28.40 డాలర్ల లాభంతో 2,445.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో గోల్డ్ స్పాట్ ఔన్స్‌కి 0.99 శాతం లేదా 23.98 డాలర్లు పెరిగి $ 2,439.20 వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు.


ఇది కూడా చదవండి:

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్


Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read Latest Business News and Telugu News

Updated Date - May 20 , 2024 | 06:04 PM