Fraud: SBI అలర్ట్.. ఆ సందేశాలు క్లిక్ చేయోద్దని సూచన
ABN , Publish Date - May 20 , 2024 | 04:54 PM
ఇటివల కాలంలో సైబర్ మోసాలు(cyber crime) పెరిగిపోయాయి. గతంలో అయోధ్య రామ మందిరం సహా పలు సందేశాల పేరుతో అనేక మందిని లూటీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కేటుగాళ్లు దేశంలోనే ప్రముఖ బ్యాంకైన SBI పేరుతో పలువురికి సందేశాలు పంపిస్తూ దోపిడికీ పాల్పడుతున్నారు.
ఇటివల కాలంలో సైబర్ మోసాలు(cyber crime) పెరిగిపోయాయి. గతంలో అయోధ్య రామ మందిరం సహా పలు సందేశాల పేరుతో అనేక మందిని లూటీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కేటుగాళ్లు దేశంలోనే ప్రముఖ బ్యాంకైన SBI పేరుతో పలువురికి సందేశాలు పంపిస్తూ దోపిడికీ పాల్పడుతున్నారు. ఈ సందేశాల నేపథ్యంలో అప్రమత్తమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది.
మీ ఎస్‌బీఐ రివార్డ్ రూ.7250 యాక్టివేట్ అయ్యిందనే సందేశాలు వస్తే ప్రజలు(people) జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇలాంటి సందేశాలను బ్యాంకు ఎవరికీ పంపించడం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అలాంటి వాటికి స్పందించవద్దని వెల్లడించింది. ఇప్పటికే అనేక మంది అలా వచ్చిన సందేశాలు క్లిక్ చేసి డబ్బులు పొగొట్టుకున్నట్లు గుర్తు చేసింది. అంతేకాదు ఇటివల కాలంలో ఎస్‌బీఐ రివార్డు పాయింట్ల పేరుతో అనేక ప్రాంతాల్లో ఈ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయని వెల్లడించింది.
ఇటివల ఓ వ్యక్తి మొబైల్ నంబర్‌కు మెసేజ్ వచ్చింది. ఇందులో ఎస్‌బీఐ ఇచ్చే రివార్డు పాయింట్లను(reward points) డబ్బుగా మార్చి ఖాతాలో జమ చేయాలని రాసి ఉంది. ఆ క్రమంలో ఆ సందేశం ఎస్‌బీఐ పంపిందని భావించి లింక్ క్లిక్ చేసి తన వివరాలు నింపి పంపించాడు. ఆ తర్వాత అతని మొబైల్‌కి తన ఖాతా నుంచి 5 వేల రూపాయలకుపైగా కట్ అయినట్లు మరో మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆ వ్యక్తి సైబర్ పోలీస్ స్టేషన్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఇలాగే అనేక ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు సందేశాలు వస్తున్నట్లు ఇటివల వెలుగులోకి వచ్చింది. అలా వచ్చిన వాటిని క్లిక్ చేయోద్దని పోలీసులు సైతం సూచించారు.
ఇది కూడా చదవండి:
Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest Business News and Telugu News