Railways: రూ.150కే వసతి కల్పిస్తున్న రైల్వేశాఖ..ఈ ప్రయోజనాలు మీకు తెలుసా?
ABN , Publish Date - Jan 07 , 2024 | 04:33 PM
భారతీయ రైల్వే ప్రయాణీకులకు(Railway passengers) వసతి సౌకర్యం కూడా అందిస్తుందని మీకు తెలుసా? తెలియదా అయితే ఈ రిటైరింగ్ వసతి సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎలానో ఇప్పుడు చుద్దాం.
భారతీయ రైల్వే(Railway) ప్రయాణీకులకు(passengers) వసతి సౌకర్యం కూడా ఉందని మీకు తెలుసా? తెలియదా అయితే ఈ రిటైరింగ్ వసతి సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎలానో ఇప్పుడు చుద్దాం. ఈ సదుపాయాన్ని IRCTC అందిస్తుంది. ఎవరైనా ప్రయాణికులకు ఆకస్మాత్తుగా ట్రైన్ మిస్సైతే కొన్ని గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఆ క్రమంలో మరొక రైలు కోసం కొన్ని గంటల పాటు వేచి ఉండే ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ ఈ వసతి సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాదు అక్కడ ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించబడతాయి. అలాంటి సమాయాల్లో మీరు హోటల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Injury: ప్రముఖ క్రీడాకారుడికి గాయం..ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్!
రైల్వేశాఖ రిటైరింగ్ గదుల(rooms) ధరలు కూడా తక్కువగా ఉండంటం విశేషం. రూ.100 నుంచి రూ.700 వరకు ఉన్నాయి. అయితే AC, నాన్ AC గదుల ఎంపికలు కూడా ఉన్నాయి. రిటైరింగ్ రూమ్ బుకింగ్ IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఈ గదులు వేర్వేరు స్టేషన్లలో పలురకాల ధరల్లో ఉంటాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో నాన్ ఏసీ గది ధర ప్రస్తుతం 12 గంటలకు రూ.150 కాగా, ఏసీ రూం ధర 24 గంటలకు రూ.450 మాత్రమే.
మీరు ఈ గదులను 1 గంట నుంచి 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత మీరు మీ PNR నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ పేరు మీద గది బుక్ చేయబడుతుంది. అప్పుడు మీరు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.