Share News

SIMs: మీ పేరుపై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసా.. ఇలా చెక్ చేయండి

ABN , Publish Date - May 24 , 2024 | 04:06 PM

ప్రస్తుత కాలంలో అనేక మంది ఒకటికి మించి సిమ్ కార్డులను(SIM Cards) కొనుగోలు చేస్తున్నారు. కానీ అన్నింటిని ఉపయోగించడం లేదు. దీంతో తీసుకున్న వాటిని పలు చోట్ల పడేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాటిని పలువురు తీసుకుని సైబర్ క్రైమ్ సహా చోరీ చేసిన ఘటనలకు ఉపయోగించే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో మీ పేరు మీద ప్రస్తుతం ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనేది తప్పకుండా తెలుసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.

SIMs: మీ పేరుపై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసా.. ఇలా చెక్ చేయండి
Do you know how many SIMs are active

ప్రస్తుత కాలంలో అనేక మంది ఒకటికి మించి సిమ్ కార్డులను(SIM Cards) కొనుగోలు చేస్తున్నారు. కానీ అన్నింటిని ఉపయోగించడం లేదు. దీంతో తీసుకున్న వాటిని పలు చోట్ల పడేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాటిని పలువురు తీసుకుని సైబర్ క్రైమ్ సహా చోరీ చేసిన ఘటనలకు ఉపయోగించే అవకాశం ఉంది. ఇంకొంత మంది మీకు తెలియకుండా మీ ఐడీని ఉపయోగించి కూడా కొత్త సిమ్ కార్డులు తీసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో అసలు మీ పేరు మీద ప్రస్తుతం ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి. ఉపయోగించని వాటిని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం గురించి మీరు తెలుసుకోకపోతే మీ సిమ్‌ను వేరే వాళ్లు ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికోసం ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.


మీ పేరు మీద ఫేక్ సిమ్ రన్ అవుతుందో ఇలా తెలుసుకోండి

  • ముందుగా మీరు tafcop.dgtelecom.gov.in పోర్టల్‌కి వెళ్లండి

  • అక్కడ బాక్స్‌లో మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. OTP సహాయంతో లాగిన్ అవ్వండి

  • అప్పుడు మీరు మీ ID నుంచి వస్తున్న అన్ని నంబర్‌ల వివరాలను పొందుతారు

  • జాబితాలో మీకు తెలియని సంఖ్య నంబర్ ఏదైనా మీ పేరుపై ఉంటే దానిపై నివేదించవచ్చు

  • దాని కోసం నంబర్ సెలక్ట్ చేసి 'నాట్ మై నంబర్' ఎంచుకోండి

  • అప్పుడు దిగువన ఉన్న రిపోర్ట్ బాక్స్‌పై క్లిక్ చేయండి


  • ఫిర్యాదును దాఖలు చేసిన తర్వాత, మీకు టికెట్ ID రిఫరెన్స్ నంబర్ ఇవ్వబడుతుంది

  • దీని తర్వాత ఆ నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడుతుంది లేదా మీ ఆధార్ కార్డ్ నుంచి తీసివేయబడుతుంది

  • దీంతోపాటు మీరు ఉపయోగించని సిమ్ కార్డులను కూడా డియాక్టివేట్ చేసుకోవచ్చు

  • మీరు ఒక IDపై గరిష్టంగా 9 సిమ్‌లను పొందవచ్చు

  • నిబంధనల ప్రకారం ఒక ఐడిపై 9 సిమ్‌లను యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ జమ్మూ కాశ్మీర్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ఐడీపై 6 సిమ్‌లు మాత్రమే యాక్టివేట్ చేసుకోవచ్చు.


అయితే మీ SIM కార్డ్‌ను స్కామర్‌లు, హ్యాకర్‌ల నుంచి రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. మీ పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదు. దీంతోపాటు తెలియని వ్యక్తుల నుంచి సందేశాలు, కాల్‌లు లేదా వచ్చిన ఇమెయిల్‌లను తెరవవద్దు. వాటికి ప్రత్యుత్తరం ఇవ్వకూడదు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. అవి మాల్వేర్‌ను కలిగి ఉంటాయి. మీరు బయటికి వెళ్లినప్పుడు మీ ఫోన్‌పై నిఘా ఉంచండి. మీరు ఉపయోగించని SIM కార్డ్‌ని Android లేదా iPhone సెట్టింగ్‌లలో మార్పులు చేసి లాక్ చేసుకోండి.


ఇది కూడా చదవండి:

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Read Latest Business News and Telugu News

Updated Date - May 24 , 2024 | 04:08 PM