Bike: మీ బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతుందా.. అయితే ఈ తప్పులు చేయకండి
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:34 PM
మీరు వినియోగిస్తున్న బైక్(bike) రోజురోజుకు పెట్రోల్(petrol) ఎక్కువగా తాగుతుందా. బైక్‌ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్(milage) వాస్తవానికి ఇప్పుడు రావడం లేదా. అయితే మీరు రోజువారీ జీవితంలో బైక్ నడుపుతున్నప్పుడు, మనం కొన్ని తప్పులు(mistakes) చేస్తుంటాం. దాని వల్ల బైక్ మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. ఆ కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీరు వినియోగిస్తున్న బైక్(bike) రోజురోజుకు పెట్రోల్(petrol) ఎక్కువగా తాగుతుందా. బైక్‌ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్(milage) వాస్తవానికి ఇప్పుడు రావడం లేదా. అయితే మీరు రోజువారీ జీవితంలో బైక్ నడుపుతున్నప్పుడు, కొన్ని తప్పులు(mistakes) చేస్తుంటారు. దాని వల్ల బైక్ మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. ఆ కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఆ తప్పులను మళ్లీ మళ్లీ చేయకుండా ఉంటే మీ మోటార్ సైకిల్ మైలేజీ క్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు. అసలే దేశంలో పెట్రోల్ ధరలు 100 రూపాయలకు పైగా కొనసాగుతున్నాయి. చిన్న చిన్న మిస్టేక్స్ తగ్గించుకుని మళ్లీ చేయకుండా ఉంటే మీరు మనీ కూడా సేవ్(money save) చేసుకోవచ్చు.
బైక్ స్పీడ్
కొంత మంది అలవాటు లేదా హడావుడి కారణంగా బైక్‌ను అతివేగంతో నడుపుతారు. దాని వల్ల మైలేజీ తగ్గుతుంది. మీరు మీ బైక్‌ను 60-70 kmph కంటే ఎక్కువ వేగంతో రేస్ చేస్తే బైక్ ఎక్కువ పెట్రోల్‌ను వినియోగిస్తుంది. అందువల్ల మీరు ఎక్కువగా బైక్‌ను ఎకానమీ స్పీడులో(40 నుంచి 55 kmph) నడపడం మంచిది. తద్వారా మీరు బైక్ మైలేజీని పెంచుకోవచ్చు.
ఇంజిన్ ఆయిల్
మీరు మీ బైక్‌లో ఇంజన్ ఆయిల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంజిన్ ఆయిల్ తక్కువగా ఉన్నప్పటికీ చాలా మంది మోటార్‌సైకిల్‌ను అజాగ్రత్తగా నడుపుతూ ఉంటారు. దీంతో ఇంజిన్‌పై చాలా ఒత్తిడి ఏర్పడి సీజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది మైలేజీపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇంజిన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.
సర్వీసింగ్
అనేక మంది సమయాభావం లేదా అజాగ్రత్త కారణంగా వారి వాహనాన్ని సమయానికి సర్వీసింగ్ చేయించరు. అందువల్ల అది మైలేజీతో పాటు వాహనం ఇతర భాగాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల మీ మోటార్‌సైకిల్‌ను సమయానికి సర్వీసింగ్ చేయించండి. తద్వారా మీరు మంచి మైలేజీని పొందవచ్చు.
టైర్ల చేకింగ్
మీరు మీ వాహనం టైర్లను కూడా గమనిస్తూ ఉండాలి. ప్రతి బైక్ రైడర్ కనీసం వారానికి ఒకసారి తన టైర్ ప్రెషర్, పంక్చర్స్ చెక్ చేసుకోవాలి. తద్వారా మంచి మైలేజీని పొందవచ్చు.
గేర్లు కూడా
బైక్‌లో గేర్‌లను తప్పుగా మార్చడం వల్ల గేర్‌బాక్స్‌తో పాటు ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తప్పుగా చేసిన గేర్ విధానం ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. రైడ్ సమయంలో బైక్ గేర్ మార్చడానికి యాక్సిలరేటర్‌ను బలవంతంగా నొక్కవద్దు. అటువంటి పరిస్థితుల్లో ఇంధన వినియోగం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి:
పునరుత్పాదక ఇంధనంపై రూ.2.30 లక్షల కోట్లు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం