Share News

PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్‌ ఇలా విత్‌డ్రా చేయడం ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ABN , Publish Date - Sep 11 , 2024 | 01:58 PM

పీఎఫ్ అనేది ఉద్యోగులు వారి పదవీ విరమణ కోసం ఆదా చేసే ప్రభుత్వ పథకం. అయితే చాలా మంది ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ మనీ ఎలా విత్ డ్రా తీసుకోవాలనే విషయం తెలియదు. కానీ మీరు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో మీ PF ఖాతా నుంచి డబ్బును ఈజీగా ఎలా విత్‌డ్రా చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.

PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్‌ ఇలా విత్‌డ్రా చేయడం ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
PF withdrawal online process

ప్రావిడెంట్ ఫండ్ (PF) అనేది ఉద్యోగులు వారి పదవీ విరమణ కోసం ఆదా చేసే ప్రభుత్వ పథకం. పీఎఫ్ పథకంలో ఉద్యోగి, సంస్థ ఇద్దరూ జీతంలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. ఆ క్రమంలో ప్రతి ఏటా పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ లభిస్తుంది. ఈ క్రమంలో ప్రతి ఏటా చెల్లించిన మొత్తాన్ని కొన్నేళ్ల తర్వాత ఉద్యోగి పదవీ విరమణ లేదా రాజీనామా, అనారోగ్యం, పిల్లల చదవు వంటి అంశాల కోసం తీసుకోవచ్చు. కానీ చాలా మంది ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) ఉపసంహరణ ఎలా చేసుకోవాలనేది తెలియదు. కానీ మీరు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో మీ PF ఖాతా నుంచి డబ్బును ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఎలా విత్ డ్రా చేయాలి, అందుకోసం ఏం కావాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఆన్‌లైన్‌లో పీఎఫ్‌ని విత్‌డ్రా చేసుకోవడానికి ఏం కావాలి

- యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)

- EPF చందాదారుల బ్యాంక్ ఖాతా సమాచారం

- గుర్తింపు కార్డు, పాన్ కార్డు, చిరునామా రుజువు

- ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఖాతా నంబర్‌తో కూడిన క్యాన్సిల్ చెక్


పీఎఫ్‌ను ఎలా ఉపసంహరించుకోవాలి

  • ముందుగా UAN పోర్టల్‌ని https://www.epfindia.gov.in/site_en/index.php ఓపెన్ చేయండి

  • ఆ తర్వాత సర్వీసెస్ మెనూలో ఫర్ ఎంప్లాయిస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

  • తర్వాత వచ్చిన సర్వీసెస్ విభాగంలో Member UAN/Online Service (OCS/OTCP)పై క్లిక్ చేయండి

  • ఆ క్రమంలో మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. క్యాప్చాను సరిగ్గా నమోదు చేసి, సైన్ ఇన్‌పై క్లిక్ చేయండి

  • లాగిన్ అయిన తర్వాత 'మేనేజ్' ఆప్షన్ ఎంచుకోండి.

  • ఆ తర్వాత 'KYC' ఆప్షన్ ఎంచుకుని మీ ఆధార్, పాన్, బ్యాంక్ సమాచారం వంటి వివరాలను నమోదు చేసి అప్‌డేట్ చేయండి


  • KYC ధృవీకరణ తర్వాత ఆన్‌లైన్ సేవల ట్యాబ్‌కు వెళ్లండి. అక్కడ మీరు క్లెయిమ్ (ఫారం-31, 19, 10C 10D)ని మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది

  • సభ్యుల వివరాలను ధృవీకరించండి. ఆ తర్వాత మీరు స్క్రీన్‌పై సభ్యుల వివరాలు, KYC సమాచారం, ఇతర సర్వీస్ సంబంధిత వివరాలను పొందుతారు.

  • దీని తర్వాత మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి, ఇచ్చిన వివరాలను నిర్ధారించడానికి 'వెరిఫై' ఎంపికను ఎంచుకోండి

  • ఇప్పుడు ఆన్‌లైన్ క్లెయిమ్‌తో కొనసాగడానికి 'ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్' ఎంపికను ఎంచుకోండి.

  • ఆ తర్వాత మీరు అప్లికేషన్‌కు సంబంధించిన స్కాన్ చేసిన చెక్ వంటి పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది

  • ఆ తర్వాత మీకు మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుందని మెసేజ్ వస్తుంది

  • తర్వాత మీకు ఐదు రోజుల లోపు మీరు ఎంచుకున్న మొత్తం మీ ఖాతాకు బదిలీ అవుతుంది


ఇవి కూడా చదవండి

TRAI: కోటికిపైగా ఫేక్ మొబైల్ కనెక్షన్‌లు తొలగింపు.. కారణమిదే..

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Swiggy IPO: త్వరలో స్విగ్గీ ఐపీఓ.. ఎన్ని కోట్ల షేర్లు, ఎప్పటి నుంచంటే..


Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 11 , 2024 | 01:59 PM