Anant Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లిలో టెక్నాలజీ చుశారా.. ఓ రేంజ్‌లో వాడేశారు..
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:12 PM
ఆసియాలోనే అత్యంత ధనిక కుటుంబం ముఖేష్ అంబానీ(mukesh ambani) ఫ్యామిలీ. ఆయన చిన్న కుమారుడి పెళ్లి(Anant Ambani Wedding) నేపథ్యంలో వీరు గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. అయితే వీరి పెళ్లికి వచ్చిన వారి కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆసియాలోనే అత్యంత ధనిక కుటుంబం ముఖేష్ అంబానీ(mukesh ambani) ఫ్యామిలీ. ఆయన చిన్న కుమారుడి పెళ్లి(Anant Ambani Wedding) నేపథ్యంలో వీరు గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. శుక్రవారం అంటే జూలై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‍లకు పెళ్లి జరుగగా, నిన్న (జులై 14) రిసెప్షన్ కార్యక్రమంతో వేడుకలు పూర్తయ్యాయి. అయితే వీరి పెళ్లికి వచ్చిన వారి కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ముంబై(mumbai)లోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ వివాహ వేడుకలు జరుగగా, పెళ్లి వేడుకకు చేరుకోవడానికి వచ్చే గెస్టుల ఫోన్‌లకు QR కోడ్(advanced technology) పంపించారు. దీంతోపాటు వారి మణికట్టుకు వివిధ రంగుల రిస్ట్‌బ్యాండ్‌లను కట్టారు.
గూగుల్ ద్వారా అటెండెన్స్
అంతేకాదు వచ్చిన అతిథులు తమ హాజరును ఇమెయిల్ లేదా Google ద్వారా నిర్ధారించవాలని కోరారు. హాజరును నిర్ధారించడానికి ఈవెంట్‌కు ఆరు గంటల ముందు QR కోడ్‌లు వారికి షేర్ చేశారు. మొబైల్ ఫోన్‌కు పంపిన QR కోడ్, ఇమెయిల్‌ను స్కాన్ చేయడం ద్వారా వారు వేదికలోకి ప్రవేశించడానికి అనుమతించబడింది. వివిధ రంగుల పేపర్ రిస్ట్‌బ్యాండ్‌లు కూడా వారికి అందించారు. రంగును బట్టి వివిధ ప్రాంతాల్లో వారికి ప్రవేశం ఉంటుంది. పలువురు సినీ తారలు, క్రికెటర్లతో పాటు, కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ లీ జే-యోంగ్, ఆయన భార్య వారి పెళ్లి రోజున పింక్ రిస్ట్‌బ్యాండ్‌లను ధరించి కనిపించారు. శనివారం ఎరుపు రిస్ట్‌బ్యాండ్‌లు ధరించి గెస్టులు కనిపించారు.
రూల్స్ ఇందుకేనా..
మరోవైపు ఉద్యోగులు, సెక్యూరిటీ, సర్వీస్ సిబ్బంది వివిధ రంగుల రిస్ట్‌బ్యాండ్‌లను(wristbands) ధరించారు. దీంతోపాటు ఈ వేడుకల్లో భాగంగా బహుళ స్థాయి భద్రతా ఏర్పాట్లను వినియోగించారు. అగ్నిమాపక, ఇతర అత్యవసర ప్రణాళికలు కూడా అందుబాటులో ఉంచారు. సమీపంలోని ఆసుపత్రులకు అంబులెన్స్‌ల చేరేందుకు ఆయా మార్గాలు కూడా ఉన్నాయి. అయితే గత పెళ్లిలో కొంతమంది వ్యక్తులు తమ పాస్‌లను పిలవకుండానే అమ్మేశారు. ఆ క్రమంలో ఆహ్వానం లేని వారు సైతం వేడుకలకు వచ్చారు. దీంతో ఈసారి నిబంధనలను మరింత కట్టుదిట్టం చేశారు. అంతేకాదు ఈసారి కూడా నలుగురు వ్యక్తులు ఆహ్వానం లేకున్నా కూడా వచ్చినట్లు గుర్తించగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Airtel: యూజర్లకు మళ్లీ షాకిచ్చిన ఎయిర్ టెల్
Airport: ఇకపై ఈ విమానాశ్రయంలో 24×7 మద్యం దుకాణం ఓపెన్
For Latest News and Business News click here