Budget 2024-25: బడ్జెట్ 2024-25ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Jul 23 , 2024 | 11:17 AM
నిన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) లోక్‌సభలో మోడీ 3.0 మొదటి సాధారణ బడ్జెట్(Budget 2024-25)ను సమర్పించారు.
నిన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) లోక్‌సభలో మోడీ 3.0 మొదటి సాధారణ బడ్జెట్(Budget 2024-25)ను సమర్పించారు. ఈ బడ్జెట్‌లో చేసే కీలక ప్రకటనలపై యావత్ దేశం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. సీతారామన్ లోక్‌సభలో తన 7వ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఆర్థిక మంత్రి మాట్లాడుతూ మేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 5 సంవత్సరాలు పొడిగించామని తెలిపారు. దీంతో 80 కోట్ల మందికి పైగా పేదలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం ఐదు పథకాల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారని గుర్తు చేశారు. దీనివల్ల ఐదేళ్లలో 4 కోట్ల 10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాలకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి రోడ్‌మ్యాప్ ఇస్తామని మధ్యంతర బడ్జెట్‌లో హామీ ఇచ్చామని వెల్లడించారు. భారతదేశ ఆర్థికాభివృద్ధి ప్రపంచానికి అద్భుతమైన ఉదాహరణ అని ఆర్థిక మంత్రి అన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
బడ్జెట్‌లో ప్రభుత్వానికి తొమ్మిది ప్రాధాన్యతలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాటిలో
1. వ్యవసాయంలో ఉత్పాదకత
2. ఉపాధి సామర్థ్యం అభివృద్ధి
3. సంపూర్ణ మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
4. తయారీ, సేవలు
5. పట్టణాభివృద్ధి
6. శక్తి భద్రత
7. మౌలిక సదుపాయాలు
8. ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి
9. మెరుగుదలలు
ఇవి కూడా చదవండి:
Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. ఆ షేర్లన్నీ ఢమాల్..
Economic Survey: ఆర్థిక సర్వే ప్రత్యేకత ఏంటి.. బడ్జెట్‌కు ఒకరోజు ముందే ఎందుకు సమర్పిస్తారు?
Read More Business News and Latest Telugu News