Share News

Credit Score: ఈ టిప్స్‌తో మీ సిబిల్ స్కోర్‌ను అమాంతం పెంచుకోండి..

ABN , Publish Date - Sep 28 , 2024 | 01:13 PM

లోన్ కోసం వెళ్లినప్పుడు ఎక్కువమంది తక్కువ సిబిల్ స్కోర్‌ వల్ల ఇబ్బందులు పడుతుంటారు. బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉండాలి. సిబిల్ స్కోర్ 650 కంటే తక్కువుగా ..

Credit Score: ఈ టిప్స్‌తో మీ సిబిల్ స్కోర్‌ను అమాంతం పెంచుకోండి..
CIBIL SCORE

ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అవసరమైన డబ్బులు మన దగ్గర లేకపోతే వెంటనే గుర్తొచ్చేది లోన్. ఎప్పుడైనా లోన్ తీసుకోవాలంటే వెంటనే బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేస్తాయి. గతంలో ఎప్పుడైనా లోన్లు తీసుకుని ఉంటే.. సమయానికి చెల్లించారా లేదా తెలుసుకోవాడినికి క్రెడిట్ స్కోర్‌ను చూసి.. దాని ఆధారంగా మీకు ఇచ్చే మొత్తాన్ని నిర్ణయిస్తాయి. లోన్ కోసం వెళ్లినప్పుడు ఎక్కువమంది తక్కువ సిబిల్ స్కోర్‌ వల్ల ఇబ్బందులు పడుతుంటారు. బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉండాలి. సిబిల్ స్కోర్ 650 కంటే తక్కువుగా ఉంటే లోన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రుణం పొందడంలో క్రెడిట్ స్కోర్ కీలకంగా పనిచేస్తుంది. లోన్ తీసుకునేటప్పడు క్రెడిట్ స్కోర్ మెరగ్గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.


సిబిల్ స్కోర్..

క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని అంచనా వేస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా, సకాలంలో చెల్లిస్తారా లేదా ఈజీగా తెలుసుకోవడానికి క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. సిబిల్ స్కోర్ ఎక్కువుగా ఉంటే సులభంగా లోన్ పొందవచ్చు. క్రెడిట్ స్కోర్ తక్కువుగా ఉంటే మీ లోన్ అప్లికేషన్‌ను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉంటుంది.


సిబిల్ తగ్గడానికి కారణాలు..

సిబిల్ స్కోర్ తగ్గడానికి అనేక కారణాలు ఉండొచ్చు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోయినా, క్రెడిట్ కార్డును ఎక్కువుగా ఉపయోగించి తిరిగి చెల్లింపులు చేయకపోతే సిబిల్ స్కోర్ తగ్గుంది. ఆదాయానికి మించి రుణాలు ఎక్కువుగా తీసుకుంటే.. మీరు లోను చెల్లించలేరని బ్యాంకు భావిస్తే సిబిల్ స్కోర్‌ను తగ్గించే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డులో పూర్తి పరిమితిని ఉపయోగించి.. ప్రతి నెలా నిర్ణీత సమయానికి బిల్లు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. గతంలో ఎప్పుడూ రుణం తీసుకుని ఉండకపోయినా, క్రెడిట్ కార్డు ఉపయోగించకపోతే అటువంటి వ్యక్తులకు క్రెడిట్ స్కోర్ ఉండదు. బ్యాంకులకు మీ ఆర్థిక స్థితిపై అవగాహన ఉండదు. దీంతో రుణం ఇచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. సిబిల్ స్కోర్ బాగోకపోతే రుణం పొందడం కష్టం అవుతుంది. రుణం తీసుకున్నా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.


క్రెడిట్ స్కోర్ ఎలా మెరుగుపర్చుకోవాలి..

సిబిల్ స్కోర్‌ను పెంచుకోవడానికి వెంటనే పాత బకాయిలను చెల్లించాలి. క్రెడిట్ కార్డు లేదా పాత లోన్ల బకాయిలను తక్షణమే చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. క్రెడిట్ కార్డును పరిమితంగా ఉపయోగించాలి. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తే సిబిల్ స్కోర్ స్థిరంగా ఉంటుంది. రుణం తీసుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేట్లు ఉండేలా చూసుకోండి. ఆ రుణాన్ని తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం ఉందా లేదా చూసుకోవాలి. ప్రతి నెలా నిర్ణీత సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు, ఇతర ఈఎంఐలు చెల్లిస్తే సిబిల్ స్కోర్‌పై ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపించదు.


Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 28 , 2024 | 01:13 PM