Aadhaar Update Deadline: ఇదే లాస్ట్ ఛాన్స్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌కు కొన్ని గంటలే గడువు..
ABN , Publish Date - Dec 13 , 2024 | 06:08 PM
మీరు మీ ఆధార్ వివరాలను ఇంకా అప్‌డేట్ చుసుకోలేదా. అయితే వెంటనే చేసుకోండి. ఎందుకంటే దీనికి రేపే చివరి తేదీగా ఉంది. అయితే దీనిని ఎలా చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు మీ ఆధార్ కార్డ్‌లో (aadhar card) ఇంకా ఏదైనా సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని చుస్తున్నారా. అయితే వెయిట్ చేయకుండా వెంటనే చేసేసుకోండి. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ఇంకా కొన్ని గంటల గడువు మాత్రమే ఉంది. ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువు డిసెంబర్ 14న అంటే శనివారంతో ముగుస్తుంది. ఈ గడువు ముగిసిన తర్వాత మీ వివరాలను అప్‌డేట్ చేయడానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. UIDAI ఈ సంవత్సరం ప్రారంభంలో ఉచిత ఆధార్ అప్‌డేట్ సేవను ప్రకటించింది.
ఉచితంగా అప్‌డేట్
ఇది ఇప్పటికే చాలాసార్లు పొడిగించబడింది. మార్చి నుంచి జూన్ వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ వరకు, తర్వాత డిసెంబర్ 14 వరకు పొడిగించారు. అయితే ఈసారి కూడా అధికార యంత్రాంగం గడువును పొడిగిస్తుందా లేదా అనేది చూడాలి మరి. UIDAI ప్రకారం ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ చిరునామా, ఫోన్ నంబర్, పేరు మొదలైన వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
మొబైల్ నంబర్
మీరు బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లాలి. UIDAI వెబ్‌సైట్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి జనాభా సమాచారాన్ని అప్‌డేట్ చేసే సదుపాయం mAadhaar యాప్‌లో అందుబాటులో లేదు. ప్రస్తుతం చిరునామాను అప్‌డేట్ చేసుకునే డాక్యుమెంట్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్ భవిష్యత్తులో రానుందని తెలుస్తోంది.
ఆన్‌లైన్‌లో ఆధార్ ఎలా అప్‌డేట్ చేయాలి?
myaadhaar.uidai.gov.inకి వెళ్లండి
'లాగిన్' బటన్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ఆపై 'OTP పంపు'పై క్లిక్ చేయండి.
ఆ క్రమంలో వచ్చిన OTPని నమోదు చేసి, 'లాగిన్' బటన్‌పై క్లిక్ చేయండి
‘డాక్యుమెంట్ అప్‌డేట్’ ఎంపికను ఎంచుకోండి
సూచనలను చదివి, 'తదుపరి'పై క్లిక్ చేయండి
“పై వివరాలు సరైనవని నేను ధృవీకరించాననే దానిని ఎంచుకుని, ఆపై ‘తదుపరి’పై క్లిక్ చేయండి
మీ ‘ఐడెంటిటీ ప్రూఫ్’, ‘అడ్రస్ ప్రూఫ్’ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసి, ‘సమర్పించు’పై క్లిక్ చేయండి
ఆ క్రమంలో మీరు ఇమెయిల్ ద్వారా ‘సేవా అభ్యర్థన సంఖ్య (రసీదు సంఖ్య)’ని అందుకుంటారు, దాన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్ అప్‌డేట్ స్థితిని ట్రాక్ చేయవచ్చు.
ఇంట్లోనే ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోండి
మీరు ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి కేంద్రం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) ద్వారా ఇంట్లో కూర్చుని మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు IPPB అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/కి వెళ్లాలి. నాన్ IPPB బ్యాంకింగ్ విభాగంపై క్లిక్ చేయండి. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఎంపికకు వెళ్లి, ‘ఆధార్ మొబైల్ అప్‌డేట్’ బాక్స్‌ను ఎంచుకోండి. అప్పుడు మీ ఫారమ్ నింపండి. ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, పోస్టల్ డిపార్ట్‌మెంట్ మిమ్మల్ని సంప్రదిస్తుంది. దీని తర్వాత డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Read More Business News and Latest Telugu News