Share News

Anil Ambani: అప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న వ్యక్తి.. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పుల్లో..

ABN , Publish Date - Apr 11 , 2024 | 11:24 AM

2008లో ప్రపంచంలోనే 42 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆరో అత్యంత సంపన్న వ్యక్తి(richest person) అనీల్ అంబానీ(Anil Ambani). ఈయన ఎవరో కాదు స్వయనా ముఖేష్ అంబానీ సోదరుడు కావడం విశేషం. గతంలో ముఖేష్ కంటే అనీల్ అంబానీ సంపద ఎక్కువగా ఉండేది. కానీ ఆర్థిక వివాదాల కారణంగా అనీల్ అంబానీ బిలియనీర్ల జాబితాలో లేకుండా పోయారు.

Anil Ambani: అప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న వ్యక్తి.. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పుల్లో..
Anil Ambani

2008లో ప్రపంచంలోనే 42 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆరో అత్యంత సంపన్న వ్యక్తి(richest person) అనీల్ అంబానీ(Anil Ambani). ఈయన ఎవరో కాదు స్వయనా ముఖేష్ అంబానీ సోదరుడు కావడం విశేషం. గతంలో ముఖేష్ కంటే అనీల్ అంబానీ సంపద ఎక్కువగా ఉండేది. కానీ ఆర్థిక వివాదాల కారణంగా అనీల్ అంబానీ బిలియనీర్ల జాబితాలో లేకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు బుధవారం సుప్రీంకోర్టు(Supreme Court) తన మూడేళ్ల నిర్ణయాన్ని రద్దు చేయడంతో మరో షాక్ తగిలింది.


అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన మెట్రో సర్వీస్ కంపెనీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL) రూ. 8,000 కోట్ల మధ్యవర్తిత్వ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. మధ్యవర్తిత్వ తీర్పులో పేటెంట్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC), (DAMEPL)కు డిపాజిట్ చేసిన రూ. 8,000 కోట్లు తిరిగి ఇవ్వాల్సిన పనిలేదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తన నిర్ణయంలో తెలిపింది. ఈ వివాదంలో 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే పక్కన పెట్టడం చర్చనీయాశంగా మారింది.


ఈ కేసు విషయానికి వస్తే DMRC, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ద్వారకా సెక్టార్ 21 వరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ డిజైన్, ఇన్‌స్టాల్, కమిషన్, ఆపరేట్, మెయింటెనెన్స్ కోసం 30 సంవత్సరాల పాటు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL) భద్రతా సమస్యల కారణంగా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో లైన్‌ను నడపడానికి ఒప్పందం నుంచి వైదొలిగింది.

ఈ వివాదంలో DMRCకి వ్యతిరేకంగా 2021లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ క్రమంలో DMRC దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ అంగీకరించిన ధర్మాసనం తాజాగా అనీల్ అంబానీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. DMRCకి వ్యతిరేకంగా అమలు చేసిన 2017 మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఉత్తర్వును సెప్టెంబర్ 9, 2021న సుప్రీంకోర్టు సమర్థించింది. అలాంటి ఉత్తర్వులను కోర్టులు పక్కన పెడతాయని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది.


ఇది కూడా చదవండి:

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత..

EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే



మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 11 , 2024 | 11:44 AM