Gautam Adani: ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాల కల్పన
ABN , Publish Date - Jan 10 , 2024 | 12:50 PM
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారీ పెట్టుబడులు పెడతామని అదానీ (Adani) సంస్థ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని వివరించింది. దీంతో లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని పేర్కొంది.
గాంధీనగర్: గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారీ పెట్టుబడులు పెడతామని అదానీ (Adani) సంస్థ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని వివరించింది. దీంతో లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని పేర్కొంది. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024లో ( Vibrant Gujarat Summit) అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థ రూపొందిస్తున్నామని ప్రకటించారు.
గుజరాత్‌లో (Gujarat) తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికను గౌతమ్ అదానీ (Gautam Adani) వివరించారు. గత సమ్మిట్‌లో తమ కంపెనీ రూ.55 వేల కోట్ల పెట్టుబడులు పెడతానని ప్రకటించిన విషయాన్ని గౌతమ్ అదానీ (Gautam Adani) గుర్తుచేశారు. ఇప్పటికే వివిధ రంగాల్లో రూ.50 వేల కోట్లు పెట్టుబడులు పెట్టామని వివరించారు. ఆ పెట్టుబడులతో 25 వేల మందికి ప్రత్యకంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ (Modi) నాయకత్వంలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని గౌతమ్ అదానీ ప్రశంసించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.