హైదరాబాద్‌లో ‘మేబాక్’ ప్రత్యేక లాంజ్
ABN , Publish Date - Sep 21 , 2024 | 03:13 AM
జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్.. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోంది.
ఈక్యూఎస్ సీరి్‌సలో మరో ఈవీ
మెర్సిడెస్ బెంజ్ ఎండీ సంతోష్ అయ్యర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్.. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా శనివారం తన మేబాక్ సీరిస్ కార్ల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక లాంజ్ ప్రారంభిస్తోంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ ఈ విషయం వెల్లడించారు. తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన తమ లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ (ఈవీ) మేబాక్ ఈక్యూఎస్ 680 ఎస్‌యూవీకి హైదరాబాద్ నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. రూ.2.25 కోట్ల ఎక్స్‌షోరూమ్ ధర ఉండే ఈ ఈవీని కంపెనీ అమెరికా తర్వాత భారత్‌లో మాత్రమే అసెంబుల్ చేస్తోంది. తమ విద్యుత్ వాహనాలు ఏవైనా ఒకసారి చార్జి చేస్తే 600 నుంచి 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అయ్యర్ చెప్పారు.
బ్యాటరీపై పదేళ్ల హామీ: తమ ఈవీల్లో ఉపయోగించే బ్యాటరీలకు పదేళ్ల హామీ ఉంటుందని సంతోష్ అయ్యర్ తెలిపారు. పన్నులు, ప్రభుత్వ సబ్సిడీలు ఈవీల ధరల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పుణెలోని ప్లాంట్‌పై మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పటి వరకు రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంవత్సరం మరో రూ.200 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడించారు.