Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరుకున్నాయంటే
ABN , Publish Date - May 21 , 2024 | 06:24 AM
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ధర రూ. 750 పెరుగగా, వెండి రేటు రూ. 1700 పెరిగింది. దీంతో నేడు (మే 21న) ఉదయం 6 గంటల నాటికి ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,320గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,060కు చేరుకుంది.
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ధర రూ. 750 పెరుగగా, వెండి రేటు రూ. 1700 పెరిగింది. దీంతో నేడు (మే 21న) ఉదయం 6 గంటల నాటికి ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,320గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,060కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,170గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,910కి చేరింది. అయితే ఇటివల ఇరాన్ అధ్యక్షుడి మరణం సహా అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పుత్తడి, వెండి రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ (10 గ్రాముల) బంగారం రేట్లు
ఢిల్లీలో బంగారం ధర రూ. 75,320, ధర రూ. 69,060
హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 75,170, ధర రూ. 68,910
విజయవాడలో బంగారం ధర రూ. 75,170, ధర రూ. 68,910
చెన్నైలో బంగారం ధర రూ. 75,290, ధర రూ. 69,010
ముంబైలో బంగారం ధర రూ. 75,170, ధర రూ. 68,910
కోల్‌కతాలో బంగారం ధర రూ. 75,170, ధర రూ. 68,910
నేటి వెండి ధరలు
ఈ పరిణామాల నేపథ్యంలో వెండి(silver) రేట్లు కూడా 1700 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో ఈరోజు (మే 21న) కేజీ వెండి ధర లక్ష రూపాయలను దాటేసి రూ. 1,01,100కు చేరుకుంది. ఈ క్రమంలో విజయవాడలో కిలో వెండి ధర రూ.1,01,100, ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.96,600, చైన్నైలో రూ. 1,01,100, కేరళలో రూ. 1,01,100, ముంబైలో రూ. 96,600, బెంగళూరులో రూ. 96,600, కోల్‌కతాలో రూ. 96,600గా ఉంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది.
ఇది కూడా చదవండి:
Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్
Iran President: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి.. చమురు, గోల్డ్, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం?
Read Latest Business News and Telugu News