Share News

Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త

ABN , Publish Date - Oct 02 , 2024 | 08:10 AM

బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది. గత రెండు, మూడురోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండి ధర కూడా కాస్త తగ్గింది.

Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త
Gold

దసరా పండగ దగ్గరకొచ్చింది. నవరాత్రుల్లో అమ్మవారిని భక్తులు నిష్టతో పూజిస్తారు. పండగ రోజున కొత్త బట్టలు ధరించడం కామన్. మరికొందరు బంగారం (Gold), వెండి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. పండగకు ముందు బంగారం కొనే ప్రియులకు శుభవార్త. బంగారం ధర ఈ రోజు కూడా తగ్గింది. గత రెండు, మూడు రోజుల నుంచి పసిడి ధర తగ్గుతూ వస్తోంది. పండగ తర్వాత శుభ ముహూర్తాలు, పెళ్లిళ్లు ఉండటంతో ఇప్పుడే బంగారం కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.


gold.jpg


తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70, 490గా ఉంది. నిన్న ఉదయం 6 గంటలకు 10 గ్రాముల బంగారం ధర రూ.70,790గా ఉంది. ఒక్కరోజులో రూ.300 వరకు తగ్గింది. ఇక మేలిమి బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగానే బంగారం ధరలు ఉన్నాయి.


gold.gif


ముంబై, ఢిల్లీలో ఇలా

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70, 490 ఉంది. మేలిమి బంగారం రూ.76,990గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,490గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.76,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,640గా ఉంది. మేలిమి బంగారం ధర రూ. 76,050గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.76,900గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,490గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.76,900గా ఉంది. బంగారం ధర బాటలో వెండి ధర కూడా తగ్గుముఖం పడుతోంది. కిలో వెండి ధర రూ.94,900గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Oct 02 , 2024 | 03:29 PM